బౌండరీ లైన్ దగ్గర బొక్క బోర్ల పడ్డ యూఏఈ బ్యాటర్.. వీడియో చూస్తే నవ్వాగదు..

క్రికెట్ ఆటలో మైదానంలో క్రికెటర్ల మధ్య చాలా ఆసక్తికర సన్నివేశాలు ప్రతి మ్యాచ్ లో జరుగుతూ ఉంటాయి.క్రికెటర్లు క్యాచ్ పట్టినప్పుడు వారి సంతోషాన్ని ఒక రకమైన హవాభవంతో వ్యక్తం చేస్తారు.

 Uae Batsman Aayan Afzal Khan Trips Over Boundary Rope Viral Funny Video Details,-TeluguStop.com

కొందరు క్యాచ్ పట్టబోయి కింద పడిపోయిన సందర్భాలు కూడా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి.మరి కొంతమంది క్రికెటర్లు బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చేటప్పుడు వారు ఒక ప్రత్యేకమైన శైలిలో నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు.

తాజాగా క్రికెట్ లో చిన్న దేశాలు టి20 ప్రపంచ కప్ ఆడేందుకు అర్హత సాధించడానికి మ్యాచ్లు ఆడుతున్నాయి.యూఏఈ, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరుగుతున్న ఒక మ్యాచ్ లో ఒక ఫన్నీ సంఘటన జరిగింది.

క్రికెట్‌లో ఎప్పుడూ ఏదో ఒక ఫన్నీ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.టీ20 ప్రపంచకప్‌లో జరిగిన ఘటన కూడా అలాంటిదే.యూఏఈ, నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేసింది.

ఈ జట్టు సభ్యుడు ఆయన్ అఫ్జల్ ఖాన్, t20 ప్రపంచకప్‌లో ఆడిన అత్యంత చిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.

ఇతని వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే.అయితే,ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఫెయిలైన అతడు అవుటై తిరిగి వెళ్తూ వెళ్తూ బౌండరీ లైన్ వద్ద తడబడి బొక్కబోర్లా పడ్డాడు.జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన ఆయన్ అఫ్జల్ ఖాన్ 7 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.

దీంతో నిరాశగా పెవిలియన్ వైపు అడుగులు వేసిన అతను బౌండరీ రోప్ కాళ్లకు అడ్డుగా తగలడంతో బోర్లా పడిపోయాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు కాస్త కింద చూసుకో బ్రో అని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube