ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ : తెలుగమ్మాయిని తప్పించే యోచనలో టెస్లా అధినేత.. ఎవరీ విజయ గద్దె..?

టెస్లా అధినేత, ప్రముఖ బిలియనీర్ ఎలాన్‌ మస్క్ ట్వీటర్‌‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న పలువురికి ఉద్వాసన పలుకుతున్నారు.తనకు అనుకూలంగా ఉండే వారికి కీలక పదవులు అప్పగించేందుకు ఎలాన్ మస్క్ ఆసక్తి చూపిస్తున్నారు.

 Twitter ‘censorship Chief’ Gadde In Tears, Risks Losing Her $17 Million Sala-TeluguStop.com

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది స్వచ్ఛందంగా పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోతుండగా.మరికొంత మందిని బలవతంగా రాజీనామా చేయిస్తున్నారు.

ట్వీట్టర్ సీఈఓగా వున్న భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ తప్పుకున్న తర్వాత ఆ స్థానం ఖాళీ అయింది.ఇప్పుడు ఆ స్థానంలో ట్విట్ట‌ర్‌ కో-ఫౌండ‌ర్, మాజీ సీఈవో జాక్ డోర్సీ బాధ్య‌త‌లు వ‌హించ‌బోతున్నారని ప్రచారం జరుగుతోంది.

ట్విట్ట‌ర్‌ను ప్రైవేట్ కంపెనీగా మార్చాల‌న్న మ‌స్క్ నిర్ణయానికి డోర్సీ మద్ధతు పలకడం కూడా ఆయనకు కలిసి వచ్చినట్లుగా కార్పోరేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ట్విట్ట‌ర్‌లో జాక్ డోర్సీకి 2.36 శాతం వాటాలు ఉన్నాయి.

ఇకపోతే.

ప్రస్తుతం ఎలాన్ మస్క్ కన్ను భారత సంతతికి చెందిన విజయ గద్దెపై పడింది.ట్విట్టర్ లీగల్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న.

విజయకు ఏడాదికి 17 మిలియన్ డాలర్ల వేతనాన్ని సంస్థ చెల్లిస్తోంది.తద్వారా ట్విట్టర్‌లో అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా ఆమె నిలిచిన సంగతి తెలిసిందే.48 ఏళ్ల విజయ గద్దె గత వారం ట్విట్టర్ భవిష్యత్తు గురించి సహోద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ కంటతడి పెట్టారు.2020 అధ్యక్ష ఎన్నికల్లో హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్ గురించి ప్రత్యేక కథనాన్ని వ్రాసిన న్యూయార్క్ పోస్ట్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసినందుకు గాను విజయ గద్దెను ఎలాన్ మస్క్ బహిరంగంగానే విమర్శించారు.

Telugu Billionaireelon, York, Parag Agarwal, Riskssalary, Rosati, Censorshipgadd

కాగా.2011లో ట్విట్టర్‌లో చేరిన విజయ క్రమంగా టీమ్ లీడర్‌గా ఎదిగారు.ట్విట్టర్‌లో భద్రతాపరమైన నిర్ణయాలు, విధానాలను రూపొందిస్తున్నారు.350 మంది పనిచేసే ట్విట్టర్ లీగల్ పాలసీ అండ్ సేఫ్టీ విభాగానికి విజయ నాయకత్వం వహిస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా ట్విట్టర్‌లో పోస్టయ్యే వ్యాఖ్యానాలు, వీడియోలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఈ విభాగానిదే.ట్విట్టర్‌లో చేరకముందు జూనిపర్ నెట్‌వర్క్స్, విల్సన్ సోన్సినీ గుడ్‌రీచ్ అండ్ రోసాటి సంస్థలకు న్యాయ సేవలందించారు విజయ.ఇక గత దశాబ్ధ కాలంగా ట్విట్టర్ తీసుకున్న నిర్ణయాల వెనుక ఆమె కీలక పాత్ర పోషించారు.2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ ప్రకటనలను అమ్మకూడదని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీని ఒప్పించడంలో గద్దె విజయ క్రియాశీలకంగా వ్యవహరించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube