అమెరికా మాజీ అధ్యక్షుడు వివాదాస్పద నిర్ణయాలకు కేరాఫ్ గా నిలిచిన ట్రంప్ ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారట.దాంతో ఉన్న ఆస్తులను అమ్ముకుంటూ తన అప్పులను తీర్చుతున్నట్టుగా తెలుస్తోంది.
అసలు ట్రంప్ కి ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ ఆయన అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు.కరోనా సమయంలో వచ్చిన లాక్ డౌన్, ఆంక్షల కారణంగా వ్యాపార సంస్థలపై, ఫ్యాక్టరీలు, హోటల్స్ పై తీవ్రమైన పెను ప్రభావం పడింది.
ఆ సమయంలో ఉన్న ట్రంప్ పదవీచ్యుతుడు అవ్వడానికి కరోనా కూడా ఓ కారణమని చెప్పవచ్చు.అయితే కరోనా ట్రంప్ ను పదవి నుంచీ తప్పించడమే కాదు…ఆయన వ్యాపార సామ్రాజ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపించింది.
ట్రంప్ మాజీ అధ్యక్షుడు అయ్యాక కరోనా కారణంగా అలాగే , పర్యవేక్షణ లోపం కారణంగా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారని దాంతో ఆస్తులు అమ్ముకోవడానికి కూడా సిద్దంగా ఉన్నారని టాక్ వినిపించింది.అయితే నేడు ఈ వార్తలే నిజమవుతున్నాయి.
వాషింగ్టన్ లో ట్రంప్ కి ఉన్న అతిపెద్ద విలాసవంతమైన లగ్జరీ హోటల్ ను ట్రంప్ మయామి కి చెందిన సిజిఐ గ్రూప్ కి అమ్మేసినట్టుగా తెలుస్తోంది.అంతేకాదు ఈ హోటల్ ముందు భాగంలో ఉండే ట్రంప్ పేరుతో ఉన్న బోర్డును సైతం పీకేసి తన కంపెనీ పేరు పెట్టుకున్నారట కొనుగోలు చేసిన సంస్థ.
ఈ హోటల్ ను ట్రంప్ అమ్మేయడం వలన వాషింగ్టన్ లో ట్రంప్ వ్యాపార సామ్రాజ్యం లేకుండా పోయిందని ఆయన అనుయాయులు ఆవేదన చెండుతున్నారట.అయితే ఈ హోటల్ అమ్మకం కారణంగా ట్రంప్ కి నష్టమేమి రాలేదని కళ్ళు చెదిరే భారీ డీల్ వీరి మధ్య జరిగిందని తెలుస్తోంది.ఇంతకీ ఈ భారీ డీల్ మొత్తం ఎంతో తెలుసా 375 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లో అక్షరాలా రూ.2900 కోట్లు పై మాటే.సదరు హోటల్ లో సుమారు 263 గదులు ఉండగా ఒక్కో గదికి 1 మిలియన్ డాలర్ ఖర్చు చేసి సదరు సంస్థ కొనుగోలు చేసిందని తెలుస్తోంది.ఇదిలాఉంటే ట్రంప్ బోర్డు పీకేసి వాల్ డార్ఫ్ అనే పేరుతో బోర్డ్ పెట్టారట.
వారి అభిరుచులకు తగ్గట్టుగా హోటల్ లో మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది.