అలాంటి పాత్రలో త్రిష.. ఫ్యాన్స్ నోరెళ్లబెడతారట!

అందాల భామ త్రిష ఇన్నేళ్లుగా తన అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోంది.దాదాపు సౌత్‌లోని అందరూ స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ, ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెద్దపీట వేస్తూ దూసుకుపోతుంది.

 Trisha To Play Police Officer For First Time, Trisha, Police Officer, Tollywood-TeluguStop.com

ఇప్పటికే వరుసగా అలాంటి సినిమాలు చేస్తూ వస్తోన్న త్రిష, హీరోయిన్‌గా చాలా సెలెక్టివ్ చిత్రాల్లో నటిస్తోంది.కాగా ప్రస్తుతం త్రిష చేతుల్లో చాలా సినిమాలే ఉన్నాయి.

అయితే తాజాగా త్రిష చేయబోయే ఓ సినిమాలో ఆమె ఇప్పటివరకు చేయని పాత్రలో మనకు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.త్రిష కెరీర్‌లో ఆమె పోలీస్ పాత్ర చేయలేదు.దీంతో ఆమె చేస్తున్న ఓ చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో త్రిష మనకు కనిపించనున్నట్లు తెలుస్తోంది.పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మొత్తానికి త్రిష పోలీస్ పాత్రలో ఎలా కనిపిస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.కాగా టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో తొలుత హీరోయిన్‌గా త్రిషను అనుకున్నారు.

కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి త్రిష వాకౌట్ చేసింది.దీంతో త్రిషకు మళ్లీ టాలీవుడ్‌లో అవకాశాలు వస్తాయా రావా అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది.

కానీ మాస్ రాజా రవితేజ నటిస్తున్న ఓ సినిమాలో త్రిషను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube