టీఆర్ఎస్‌లో ఆస‌క్తిగా మారిన ట్ర‌యాంగిల్ ఫైట్‌

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది.ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్క‌లాట మొద‌లైంది.

 Triangle Fight Between Trs Leaders-TeluguStop.com

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ సంపాదించడ‌మే ల‌క్ష్యంగా ప‌లువురు నాయ‌కులు పావులు క‌దువుపుతున్నారు.ఇక సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ మాత్రం ఈసారి కూడా త‌న‌కే టికెట్ వ‌స్తుంద‌నీ, గెలుపు త‌న‌దేన‌ని ధీమాగా ఉన్నారు.

ఇదే స‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి బ‌స్వ‌రాజు సార‌య్య కూడా టికెట్ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇక పాల‌కుర్తి ఎమ్మెల్య ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు సోద‌రుడు ఎర్రబెల్లి ప్ర‌దీప్‌రావు కూడా టికెట్ కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇలా ముగ్గురు నేత‌లు టికెట్ రేసులో ఉండ‌డంతో క్యాడ‌ర్ గంద‌ర‌గోళానికి గుర‌వుతోంది.అయితే కొద్దిరోజులుగా ఎమ్మెల్యే కొండా సురేఖ చేస్తున్న కామెంట్లు పార్టీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

తూర్పులో త‌న‌కు, భూపాలప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న కూతురు సుష్మితాప‌టేల్‌కు టికెట్ కావాల‌ని స‌రేఖ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.ఇప్ప‌టికే ఆమె భ‌ర్త కొండా ముర‌ళి ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు.

ఇదేస‌మ‌యంలో స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారిపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉందంటూ ఆమె చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో పెద్ద దుమారాన్నే రేపాయి.త‌మ కూత‌రు వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూపాల‌ప‌ల్లి నుంచి పోటీ చేస్తుంద‌ని బ‌హిరంగంగానే కొండా దంప‌తులు ప్ర‌క‌టిస్తున్నారు.ఇదిలా ఉండ‌గా.కొండా దంప‌తులు మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతార‌నే ప్ర‌చారం కూడా కొద్దిరోజుల క్రితం జోరుగా సాగింది.మ‌రోవైపు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఎమ్మెల్యే సురేఖ ప‌నితీరుపై ప్ర‌జ‌ల్లో క్ర‌మంగా వ్య‌తిరేక‌త పెరుగుతున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా… తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్‌రావు చురుగ్గా ప‌ర్య‌టిస్తున్నారు.

ప్ర‌జ‌ల‌కు, పార్టీ క్యాడ‌ర్‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఇది ఏమాత్రం జీర్ణించుకోలేని కొండా సురేఖ బ‌హిరంగంగానే విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు.

గ‌తంలో ప్ర‌దీప్‌రావు ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.ఈసారి ఎలాగైన టికెట్ తెచ్చుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు.

అయితే దీని వెన‌క పాల‌కుర్తి ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది.సీఎం కేసీఆర్ వ‌ద్ద ఎర్ర‌బెల్లికి మంచి ప‌లువుకుబ‌డి ఉంద‌నీ, ఎలాగైనా త‌న సోద‌రుడు ప్ర‌దీప్‌రావుకు టికెట్ ఇప్పించుకుంటార‌నే టాక్ వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే కొండా దంప‌తులు త‌మ‌కు ప‌ట్టున్న ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల‌పై ద‌`ష్టిసారిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube