ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది.జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇంటి గోడ కూలి ఇద్దరు మృత్యువాత పడ్డారు.
నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.దీంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కాగా మిగ్ జామ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏకధాటిగా వానలు పడుతున్న సంగతి తెలిసిందే.ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వేలాది ఎకరాల్లో పంటపొలాలు నీట మునిగాయి.