5 సేఫెస్ట్ కార్లు ఇవే... 5 స్టార్‌ రేటింగ్ వీటి సొంతం, ఓ లుక్కేయండి!

కారు ప్రయాణం అనేది చాలా సౌకర్యవంతమైనది.అందుకే సగటు మధ్యతరగతి వాడు కూడా ఇపుడు తనకు వున్నంతలో కారు మెంటైన్ చేయాలని అనుకుంటున్నాడు.

 Top 5 Safest Cars In India With Full 5-star Safety Ratings Details, Car Safety F-TeluguStop.com

అయితే ఇక్కడ కారు ప్రయాణం ఎంత బావుంటుందో తేడా వస్తే అంతే ఘోరంగా వుంటుంది.ఈ నేపధ్యంలోనే జనాలు సేఫ్టీ ఎక్కువ ఉన్న కార్లనే కొనుగోలు చేస్తున్నారు.

అలా ప్రస్తుతం ఇండియాలో అత్యధిక భద్రతా ప్రమాణాలు పాటించి, 5 స్టార్ రేటింగ్ సాధించిన కార్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం.దేశంలో అత్యంత సురక్షితమైన కార్ల లిస్టులో నెం 1 ప్లేసులో వున్నవి టాటా కార్లు.

అవును, NCAP నిర్వహించిన క్రాష్‌ టెస్ట్‌ ప్రకారం.2023లో భారతదేశంలో తయారు చేసిన అత్యంత సురక్షితమైన కార్లలో.టాటా హారియర్, టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్‌ అగ్రస్థానంలో నిలిచాయి.ఈ టాటా SUV కార్లు.సేఫెస్ట్‌ కార్ల జాబితాలోని అన్ని ఇతర మోడళ్ల కంటే అత్యధిక స్కోర్‌ను కలిగి వుండడం గమనార్హం.ఈ కార్లలో గరిష్ఠంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు ప్రామాణికంగా ఉన్నాయి.టాటా హారియర్ (TATA Harrier) ధర విషయానికొస్తే రూ.15.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.అదేవిధంగా టాటా సఫారీ (TATA Safari) ధర వచ్చి రూ.16.19 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Telugu Cars, Automobile, Car, Car Safety, India Cars, Latest, Safest Cars, Skoda

తరువాత స్థానాన్ని అలంకరించినది వోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన వర్టస్ కారు.( Volkswagen Virtus ) అవును, ఇది రెండో స్థానంలో కలదు.AOP, COP రెండింటిలోనూ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ స్కోర్‌ చేసింది ఈ కార్.వోక్స్‌వ్యాగన్ వర్టస్ ధర రూ.11.48 లక్షల నుంచి రూ.19.29 లక్షల మధ్య ఉంది.తరువాత మనదగ్గర తయారు చేసిన అత్యంత సురక్షితమైన కార్లలో “స్కోడా స్లావియా”( Skoda Slavia ) ఒకటి.ఈ కారు కూడా AOP, COP రెండు విభాగాల్లోను 5 స్టార్ రేటింగ్ సాధించింది.

Telugu Cars, Automobile, Car, Car Safety, India Cars, Latest, Safest Cars, Skoda

ఇక దీని ధర విషయం వచ్చేసరికి రూ.10.89 లక్షల నుంచి రూ.19.12 లక్షల మధ్య ఉంది.తరువాత స్థానాలలో “వోక్స్‌వ్యాగన్ టైగన్”( Volkswagen Taigun ) “స్కోడా కుషాక్”( Skoda Kushaq ) వున్నాయి.

వోక్స్‌వ్యాగన్ టైగన్ SUV కారు సేఫ్టీ కిట్‌లో.డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మొదలైన ఫీచర్లు కలవు.దీని ధర విషయానికొస్తే రూ.11.62 లక్షల నుంచి రూ.19.76 లక్షల మధ్య ఉంది.కాగా స్కోడా కుషాక్ ధర విషయానికొస్తే రూ.10.89 లక్షల నుంచి రూ.20.01 లక్షల మధ్య ఉంది.ప్రస్తుతానికి ఈ టాప్ 5 కార్లు రాజ్యమేళుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube