దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే తుపాకీతో బెదిరించి రూ.5లక్షల దోపిడీ..!

ప్రస్తుత సమాజంలో కష్టపడి సంపాదించే వారి కంటే అడ్డదారులను ఎంచుకొని సంపాదించే వారే చాలా ఎక్కువ.కుటుంబ బాధ్యతలను మరిచి జల్సాలకు అలవాటు పడిన వ్యక్తులు దారుణాలకు పాల్పడుతున్నారు.

 Robbery Of Rs. 5 Lakh Under The Threat Of A Gun In Broad Daylight In The Capital-TeluguStop.com

ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో( Capital in Delhi ) పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు.ఢిల్లీలో ఓ వ్యాపారి బ్యాంకు నుంచి నగదు విత్ డ్రా చేసుకొని బయటకు వచ్చిన తర్వాత దుండగులు తుపాకితో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

ఢిల్లీ పోలీసులు ( Delhi Police )తెలిపిన వివరాల ప్రకారం.ఢిల్లీ నగరంలోని నగరి ప్రాంతంలో శుక్రవారం ఉదయం సుమారుగా 11:50 గంటల సమయంలో నూర్ అలీ( Noor Ali ) అనే వ్యాపారి బ్యాంకు నుంచి రూ.5 లక్షలు విత్ డ్రా చేసుకొని బయటకు వచ్చిన తర్వాత బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరించి ఆ డబ్బులు తీసుకొని పరారీ అయిన్నట్టు పోలీసులు వెల్లడించారు.

Telugu Delhi, Faridabad, Noor Ali, Robbery, Rs-Latest News - Telugu

నూర్ అలీ అనే వ్యక్తి ఫరీదాబాద్ ( Faridabad )లో అల్యూమినియం మెల్టింగ్ పరిశ్రమ నిర్వహిస్తున్నాడు.శుక్రవారం ఉదయం 11:50 ప్రాంతంలో సేవా ధామ్ రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి రూ.5లక్షలు డ్రా చేసుకొని తన బంధువుల ఇంటికి బయలుదేరాడు.మార్గమధ్యంలో నంద్ నగరి లోని షంషన్ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ వంతెన వద్దకు చేరుకున్నాక హఠాత్తుగా బైక్ పై ఇద్దరు వ్యక్తులు వచ్చి అతనిపై తుపాకీ గురిపెట్టి, చేతిలో ఉండే నగదు బ్యాగును లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు.నూర్ అలీ వెంటనే స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దోపిడీ జరిగిన పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు బాధితుడికి హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube