ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలందరూ కూడా వరుసగా పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ బాక్సాఫీసు వద్ద పోటీ పడుతున్నారు అన్న విషయం తెలిసిందే.బ్లాక్ బస్టర్ నాదంటే నాదంటూ తమ సినిమాలతో తెగ సందడి చేస్తూ ఉన్నారు.
కేవలం బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రమే కాదు అటు వాణిజ్య ప్రకటనల్లో కూడా హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉంది అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.ప్రస్తుతం ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు మొత్తం కొంతమంది హీరోల చుట్టే తెగ తిరిగేస్తున్నారు.
ఒక హీరో కాకపోతే మరో హీరోతో వాణిజ్య ప్రకటనలు చేస్తూ ఉన్నాయి.ఇక ఇలా యాడ్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నాయి అని చెప్పాలి.
అయితే సినిమాలకైతే దాదాపు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కష్టపడాలి.ఇటీవలి కాలంలో అయితే మరింత ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుంది.కానీ వాణిజ్య ప్రకటనలో 1,2 రోజులు కష్టపడితే చాలు కోట్లు వెనకేసుకునేందుకు అవకాశం ఉంటుంది.దీంతో హీరోలందరూ కూడా ఈ వాణిజ్య ప్రకటనలో బాగా పోటీపడుతున్నారు అన్నది తెలుస్తుంది.
ప్రస్తుతం టాలీవుడ్లో వాణిజ్య ప్రకటనలతో టాప్ లో ఉన్నది మాత్రం మహేష్ బాబు, బన్నీ, విజయ్ దేవరకొండ అని చెప్పాలి.ముగ్గురు మధ్య గట్టి పోటీ ఉంది అన్నది తెలుస్తుంది.
ఒక వైపు మహేష్ బాబు ఎన్నో ఏళ్ల నుంచి రకరకాల యాడ్స్ చూస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు.ఒకరకంగా అందరి హీరోలతో పోలిస్తే కాస్త ముందు వరుసలోనే ఉన్నాడు.ఇటీవలే బాలీవుడ్లో కూడా వాణిజ్య ప్రకటనల్లో ప్రత్యక్షమయ్యారు మహేష్ బాబు.విజయ్ దేవరకొండ క్లాతింగ్, స్టైలింగ్ బ్రాండ్స్ కి సైన్ చేస్తూ దూసుకుపోతున్నాడు.మహేష్ బాబు థమ్స్ అప్ యాడ్ ని కూడా విజయ్ దేవరకొండ కొట్టేశాడు అనే విషయం తెలిసిందే.ఇప్పుడు మరో కొత్త కూల్ డ్రింక్ బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది.
ఇక బన్నీ పుష్ప సినిమా తర్వాత జొమాటో, ర్యాపిడో, శ్రీ చైతన్య కాలేజీ ల వాణిజ్య ప్రకటనలో కనిపిస్తున్నాడు.ఇటీవలే త్రివిక్రమ్ తో కలిసి బన్నీ ఒక యాడ్ షూటింగ్ చేశాడు.
ఇది ఏ బ్రాండ్ కు సంబంధించింది అన్నది ఇంకా తెలియరాలేదు.ఇలా ఈ ముగ్గురు హీరోలు కూడా ప్రస్తుతం బ్రాండ్ ప్రమోషన్ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు అన్నది తెలుస్తుంది.