సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కోట్ల రూపాయలు సంపాదించి.ఇలా కూడబెట్టుకున్న మొత్తాన్ని కూడా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి ఆదాయాన్ని పెంచుకోవడం చూస్తూ ఉంటారూ సినిమా సెలబ్రిటీలు.
ఎంతో మంది ఇలా వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు.కానీ మొదట వ్యాపారంలో రాణించి ఆ తర్వాత ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన బిజినెస్మేన్ లూ కూడా చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు.ఇక అలాంటి వారి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అరుల్ శరవణన్ :
చెన్నైలో శరవణన్ స్పోర్ట్స్ అనే వస్త్ర మరియు ఆభరణాల దుకాణాలు ను ఒకప్పుడు నిర్వహిస్తూ ఉండేవారు.ది లెజెండ్ మూవీ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
మంచు విష్ణు :
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు సైతం ఇలా బిజినెస్ మాన్ గా ఉండి తర్వాత సినిమాల్లో హీరోగా మారాడు.న్యూయార్క్ అకాడమీ స్ప్రింగ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ కు మెంబర్గా చైర్మన్గా ఉన్నారు.అంతేకాదు తన తండ్రి స్థాపించిన విద్యానికేతన్ విద్యా సంస్థలను కూడా నడిపించారు.

సచిన్ జోషి :
తండ్రి జగదీష్ జోషి నుంచి జెఎంజే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నీ అందుకున్నాడు సచిన్ జోషి.లంక ప్రీమియర్ లీగ్ లో
దంబుల్లా వైకింగ్స్
యొక్క ఫ్రాంచైజీని కూడా కలిగి ఉన్నాడు అని చెప్పాలి.తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి అలరించాడు.
అల్లు శిరీష్ :
సాధారణంగా అల్లు శిరీష్ నేరుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అని అందరూ అనుకుంటారు.కానీ గీత ఎంటర్టైన్మెంట్స్ ముందుగా డైరెక్టర్ గా పనిచేశాడు.ఒక మ్యాగజైన్ కూడా అప్పట్లో చూసుకున్నాడు.తర్వాత సినిమాల్లో గౌరవం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.

ఉదయ్ చోప్రా :
బాలీవుడ్లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఉదయ్ చోప్రా.యష్ రాజ్ ఫిలింస్ మేనేజర్గా ఓనర్ గా కూడా చేశాడు ఉదయ్ చోప్రా.
నాగబాబు :
మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు మొదట ప్రొడ్యూసర్ గా పనిచేసి ఆ తర్వాత టాలీవుడ్ లో నటుడిగా ఎంట్రీ ఇచ్చి రాణించారు.

ఉదయనిధి స్టాలిన్ :
ప్రొడ్యూసర్ గా మరియు రాజకీయ నాయకుడిగా ముందుగా పని చేసిన తర్వాతనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఉదయనిధి స్టాలిన్.
చెరుకూరి సుమన్ :
టెలివిజన్ రచయితగా నటుడిగా దర్శకుడిగా సుమన్ కి ప్రత్యేకమైన గుర్తింపు.అయితే ఉషోదయ ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్గా పని చేసిన తర్వాత నటుడిగా కూడా రాణించారు సుమన్.

దగ్గుబాటి రానా :
ప్రస్తుతం నటనకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న దగ్గుబాటి రానా సినిమాల్లోకి రాకముందు సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు ఐకాన్జ్ అనే భారతీయ – అమెరికన్ సంస్థ ఐపీ హక్కులను కూడా కలిగి ఉన్నాడు.
అల్లు అరవింద్ :
ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ నిర్మాత గా కొనసాగుతున్న అల్లు అరవింద్ ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ కేరళ బ్లాస్టర్ సహా యజమానిగా ఉండేవారట.హీరో, మహానగరం, మాయగాళ్లు, చంటబ్బాయి లాంటి సినిమాల్లో నటించారు అల్లు అరవింద్.
ఇప్పుడు నటనకు దూరంగానే ఉంటున్నారు.







