2021లో తెలుగు సినిమా పరిశ్రమలో మరింత వేగం పెరిగింది.టాలీవుడ్ టాప్ స్టార్స్ కు మెమరబుల్ ఇయర్ గా నిలిచింది.
ఈ ఏడాది విడుదల అయిన టాప్ హీరోల సినిమాలన్నీ బాగానే ఆడాయి.ఏ సినిమా కూడా డిసప్పాయింట్ చేయలేదు.
అంతేకాదు.స్టార్ హీరోల సినిమాలు పెద్ద సక్సెస్ లు అందుకున్నాయి.
*బాలకృష్ణ
ఈ ఏడాది నందమూరి బాలయ్యదే హవా అని చెప్పుకోవచ్చు.ఆయన నటించిన తాజా సినిమా అఖండ.
అఖండ విజయాన్ని అందుకుంది.బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన ఈ సినిమా ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
అంతేకాదు.ఆహాలో స్ట్రీమ్ అవుతున్న టాక్ షో అన్ స్టాపబుల్ కూడా బాగా జనాలను ఆకట్టుకుంది.
*నాగార్జున
ఈ ఏడాది నాగార్జునకు పెద్దగా కలిసి రాలేదు అని చెప్పొచ్చు.వైల్డ్ డాగ్ సినిమా చేసిన ఆయన.అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు.అటు బిగ్ బాస్ సీజన్-5 హోస్టుగా పర్వాలేదు అనిపించాడు.
*వెంకటేశ్
ఈ ఏడాది ఈయన నటించిన రెండు సినిమాలు విజయాన్ని అందుకున్నాయి.నారప్ప, దృశ్యం 2 చిత్రాలు.ఓటీటీలో విడుదల అయ్యాయి.అద్భుత జనాదరణ దక్కించుకున్నాయి.
*పవన్ కళ్యాణ్
పవన్ కల్యాణ్ కు కూడా ఈ ఏడాది కలిసి వచ్చింది.ఆయన నటించిన వకీల్ సాబ్ బాగానే ఆకట్టుకుంది.కోర్టు డ్రామాతో వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించింది.
*అల్లు అర్జున్
ఈయన నటించిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప – ద రైజ్ దుమ్మురేపే విజయాన్ని అందుకుంది.వసూళ్ల వర్షాన్ని కురిపిస్తుంది.
*రవితేజ
ఈయన నటించిన సినిమాలు సైతం ఈ ఏడాది బాగానే ఆడాయి.సంక్రాంతికి విడుదల అయిన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది.ఈ ఏడాది తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాగా నిలిచింది.
మొత్తంగా ఈ ఏడాది విడుదలైన టాప్ హీరోల సినిమాలు అన్ని సక్సెస్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు.