తమిళనాడు గత కొద్దిరోజుల కిందటే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే.తాజాగా తమిళనాడును మరోసారి వరదలు ముంచెత్తాయి .
వర్షం కారణంగా చెన్నై నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి .
తమిళనాడు సీఎం స్టాలిన్ వర్షాల ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు మోటారు పంపుల సహాయంతో నీటి ఎద్దడిని తొలగిస్తున్నారు.మరో 24గం.లపాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడంతో అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.