తెలుగులో ప్రముఖ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన “వి” చిత్రాన్ని ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా థియేటర్లు మూతపడగా ఈ చిత్రాన్ని ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారం అయినటువంటి అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.
దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
అయితే తాజాగా ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సిక్స్ ప్యాక్ బాడీ తో ప్రేక్షకులని బాగానే అలరించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నటువంటి హీరో సుధీర్ బాబు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించాడు.
ఇందులో భాగంగా ఈ చిత్ర షూటింగ్ సమయంలో తీసుకున్నటువంటి ఓ వర్కింగ్ స్టిల్ ని షేర్ చేశాడు.
అంతేగాక ఈ ఫోటోకి ఈ చిత్రం ఆరంభంలో వచ్చేటువంటి పవర్ ఫుల్ ఫైట్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో తీసుకున్న ఫోటో అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. అంతేగాక ఇది పరీక్షకు ముందు ఎక్స్ట్రా ప్రిపరేషన్ లాంటిదని పేర్కొన్నాడు.
దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే వైరల్ అవుతోంది.
అంతేగాక సుధీర్ బాబు ఈ ఫోటోని షేర్ చేసిన మూడు గంటల లోపే దాదాపుగా 50 వేల పై చిలుకు లైకులు వచ్చాయి.
దీంతో కొందరు సుధీర్ బాబు అభిమానులు ఈ చిత్రం మొత్తానికి ఆరంభంలో వచ్చేటువంటి ఫైట్ సన్నివేశం హైలెట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.దీనికి తోడు సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ బాడీ మరింత ప్లస్ అయ్యిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సుధీర్ బాబు ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నట్లు సమాచారం.
అంతేగాక ఈ చిత్రంలో సుధీర్ బాబు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ అయినటువంటి పుల్లెల గోపీచంద్ పాత్రలో కనిపించనున్నాడని పలు కథనాలు బలంగా వినిపిస్తున్నాయి.