ఆ సినిమా చేసే సత్తా బన్నీకి మాత్రమే ఉంది... బన్నీ గురించి చిరు షాకింగ్ కామెంట్స్!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య.ఈ సినిమా రేపు విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Tollywood-hero-chiranjeevi-shcoking-comments-on-allu-arjun Chiranjeevi, Allu Arj-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆచార్య చిత్రబృందం కొరటాల శివ, హీరో రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు హరీష్ శంకర్ చిట్ చాట్ నిర్వహించారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా హరీష్ శంకర్ చిరంజీవి సినిమాల గురించి ఎన్నో ప్రశ్నలు అడిగారు.

ఇక చిరంజీవి సినిమా రికార్డుల గురించి మనందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన చంటబ్బాయి సినిమా గురించి హరీష్ శంకర్ పలు ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా హరీష్ శంకర్ మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నిస్తూ మీరు నటించిన చంటబ్బాయి సినిమా ఈ తరం హీరోలలో ఎవరైతే బాగా నటించగలరు అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు మెగాస్టార్ చిరంజీవి ఆశక్తికరమైన సమాధానం తెలియజేశారు.

ఇక ప్రస్తుతమున్న హీరోలలో చంటబ్బాయి సినిమాని బన్నీ మాత్రమే ఎంతో అద్భుతంగా నటించగలరు.ఆ కెపాసిటీ బన్నీకి మాత్రమే ఉందని మెగాస్టార్ తన అల్లుడి పై ప్రశంసలు కురిపించారు.

Telugu Acharya, Allu Arjun, Chantabbai, Chiranjeevi, Harish Shanker, Tollywood-M

ఇక చిరంజీవి అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ బన్నీ బేసిక్ గా మిమిక్ కూడా, అన్ని కామెడీ వాయిస్ లు బాగా చేస్తాడు.మిమిక్రీతో నవ్విస్తాడు అందుకే చంటబ్బాయి సినిమా చేయడానికి బన్నీ కరెక్ట్ గా సూట్ అవుతాడని చిరంజీవి బన్నీ గురించి తెలియచేయడమే కాకుండా బన్నీ సీక్రెట్స్ అన్ని బయటపెట్టారు.ఇలా మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించడంతో బన్నీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube