నేటి పొలిటికల్ టూర్స్ : కర్నూల్ లో బాలయ్య.. చెన్నై లో పవన్ ..భీమవరంలో జగన్ 

పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి ఏపీలోని రాజకీయ పార్టీలు.ఈ మేరకు ఆయా పార్టీ ల అధినేతలు కీలక నాయకులంతా వరుసగా ఎన్నికల ప్రచారం లో నిమగ్నం అయిపోయారు.

 Today's Political Tours : Balakrishna In Kurnool Pawan In Chennai .. Jagan In B-TeluguStop.com

ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేస్తూ వివిధ హామీలు ఇస్తూ తాము అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తామని చెబుతున్నారు.ప్రజలను ఆకట్టుకునే విధంగా రకరకాల ఆమెలు ఇస్తూనే తమ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శ శలతో విరుచుకు పడుతున్నారు ఒకవైపు టిడిపి అధినేత చంద్రబాబు మరోవైపు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, చంద్రబాబు విజయుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరుసగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తూ రాజకీయ వేడిని మరింతగా పెంచే పనులు ఉన్నారు.

జగన్ పర్యటన

వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) చేపట్టిన బస్సు యాత్ర నేడు పశ్చిమగోదావరి జిల్లా చేరుకోనుంది 16వ రోజు యాత్రను నిన్న బసచేసిన నారాయణపురం దగ్గర నుంచి జగన్ ప్రారంభిస్తారు నిన్న గుడివాడ బహిరంగ సభలో పాల్గొన్న తరువాత నారాయణపురం నైట్ క్యాంప్ లో ఉన్నారు నేడు నిడమర్రు గణపురం మీదగా ఉండి చేరుకుని ఉండి శివారు లో భోజనం విరామానికి జగన్ ఆగుతారు ఆ తరువాత భీమవరం బైపాస్ రోడ్డులోని గ్రంధి వెంకటేశ్వరరావు జూనియర్ కళాశాల వద్ద జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు సభ అనంతరం పేపర్ పెరవలి సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులోని నైట్ క్యాంపు చేరుకుంటారు ఈ మేరకు జగన్ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పశ్చిమగోదావరి జిల్లా నేతలు పర్యవేక్షిస్తున్నారు.

చెన్నై కు పవన్ కళ్యాణ్

Telugu Ap, Balakrishna, Jagan, Janasenani, Pavan Kalyan, Yarcp-Politics

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నేడు తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు బిజెపి అభ్యర్థులకు మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు తమిళనాడులో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండడంతో పవన్ ను అక్కడ పర్యటించాలని బిజెపి పెద్దలు కోరడంతో ఈరోజు ఆయన అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు పవన్ కళ్యాణ్ కు చెన్నైలోనూ అభిమానులు ఎక్కువగా ఉండడం తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే అది తమకు కలిసి వస్తుందని బిజెపి భావిస్తూ ఉండడంతో పవన్ ను తమిళనాడులో పర్యటించే విధంగా ఒప్పించింది నేడు చెన్నై సౌత్ లో తమిళ సైకు మద్దతుగా పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించబోతున్నారు ఆ తర్వాత చెన్నైలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.

కర్నూలులో బాలకృష్ణ

Telugu Ap, Balakrishna, Jagan, Janasenani, Pavan Kalyan, Yarcp-Politics

నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna )చేపట్టిన స్వర్ణాంధ్ర సాధన యాత్ర నేడు  ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు ఆయన బస్సు యాత్ర నేడు కర్నూలు జిల్లాలో జరగనుంది ఎమ్మిగనూరులో జరిగే బహిరంగ సభలోను బాలకృష్ణ పాల్గొంటారు.ఎమ్మిగనూరు తో పాటు అనేక నియోజకవర్గాల్లో బాలకృష్ణ పర్యటించి ప్రసంగించనున్నారు కోట మీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తారు రాయలసీమ జిల్లాల్లో నందమూరి బాలకృష్ణకు అభిమానులు ఎక్కువగా ఉండడంతో బాలయ్యతో ప్రచారం కలిసి వస్తుందని టిడిపి లెక్కలు వేసుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube