టిక్‌టాక్ సీఈఓ త‌న పిల్ల‌ల‌ను టిక్‌టాక్ చూడ‌నివ్వ‌రు.... షౌ జీ చ్యూ విజ‌య ప్ర‌స్థానం!

యుఎస్ కాంగ్రెస్ ముందు మొదటిసారిగా వాంగ్మూలం ఇచ్చిన టిక్‌టాక్ సిఇఒ షౌ జీ చ్యూ( TikTok CEO Shou Jie Chew ) చర్చల్లో నిలిచారు.షార్ట్-వీడియో మేకింగ్ ప్లాట్‌ఫారమ్ అమెరికన్ యూజర్ డేటాను చైనా( China ) తో ఎప్పటికీ షేర్ చేయదని ఆయన అన్నారు.

 Tiktok Ceo Doesn't Let His Kids Watch Tiktok ,tiktok ,tiktok Ceo,tiktok Ceo Shou-TeluguStop.com

ఇదేకాకుండా జాతీయ భద్రతకు భయపడి యుఎస్‌లో యాప్‌ను ఎందుకు నిషేధించకూడదని టిక్‌టాక్ సీఈఓ షౌ జీ చ్యూ కాంగ్రెస్( Congress ) ముందు వాంగ్మూలం ఇచ్చారు.సెలబ్రిటీ న్యూస్ వెబ్‌సైట్ న్యూయార్క్ బ్యానర్ అందించిన‌ 2022 నివేదిక ప్రకారం, టిక్‌టాక్ సీఈఓ షౌ జీ చ్యూ నికర ఆదాయ విలువ $200 మిలియన్లు అని ఒక అంచ‌నా.

మీరు మీ పిల్లలను టిక్‌టాక్‌ని ఎందుకు వినియోగించ‌నివ్వ‌డం లేదు?

ఈ 40 ఏళ్ల టిక్‌టాక్ సీఈఓ షౌ జీ చ్యూ సింగపూర్‌( Singapore )కు చెందిన వ్యక్తి.తన స్వదేశంలో భిన్నమైన వైఖరిని అవ‌లంబిస్తున్నారు.

అతను తన పిల్లలను టిక్‌టాక్‌ని వినియోగించ‌డానికి అనుమతించ‌ర‌ని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.ఒక నివేదిక ప్రకారం, కాంగ్రెస్ మహిళ నానెట్ బర్రాగన్( Nanette Barragan ).మీ ఎనిమిదేళ్ల వయస్సు పిల్ల‌ల‌ను టిక్‌టాక్‌ను ఎందుకు వినియోగించ‌నివ్వ‌డం లేదు అని అడిగినప్పుడు.దీనిపై టిక్‌టాక్ సీఈవో స్పందించారు.

టిక్‌టాక్ సీఈఓ మాట్లాడుతూ నేను దానిలోని ప‌లు వార్తా కథనాలను చూశాను.నా పిల్లలు సింగపూర్‌లో నివసిస్తున్నారు, వారు అండర్-13 గా ఉన్నారు.

వారు ఇక్కడ అమెరికాలో నివసిస్తుంటే, నేను దానిని ఉపయోగించుకోవాల‌ని చెప్పేవాడిన అని అన్నారు.

Telugu China, Congress, Singapore, Tiktok, Tiktok Ceo, Tiktokceo-Latest News - T

సింగపూర్ స్థానికుడై ఉంటూ…

40 ఏళ్ల టిక్‌టాక్ సీఈఓ షౌ జీ చ్యూ సింగపూర్‌కు చెందినవాడు, అక్కడ అతను తన భార్య వివియన్ కావో, వారి ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు.అతను 2006లో యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుండి పట్టభద్రుడయ్యాడు.హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో మాస్టర్స్ డిగ్రీని సాధించారు.

అతను అమెరికా వెళ్లడానికి ముందు గోల్డ్‌మన్ సాక్స్‌లో రెండేళ్లు పనిచేశారు.

Telugu China, Congress, Singapore, Tiktok, Tiktok Ceo, Tiktokceo-Latest News - T

ఫేస్ బుక్ లో ఇంటర్న్‌షిప్

ప్రారంభంలో సీఈఓ షౌ జీ చ్యూ ఫేస్‌బుక్‌తో రెండేళ్ల ఇంటర్న్‌షిప్ చేశాడు.సీఈఓ షౌ జీ చ్యూ తన ఎంబీఏ డిగ్రీని పొందిన తర్వాత, అతను వెంచర్ క్యాపిటల్ సంస్థ డీఎస్‌టీ గ్లోబల్‌లో భాగస్వామి అయ్యాడు, అక్కడ అతను ఐదు సంవత్సరాలు పనిచేశాడు.ఇది మాత్రమే కాదు, దీని తర్వాత అతను 2021లో టిక్‌టాక్‌కి సీఈఓ కాకముందు చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ అయిన జియోమీ లో ఐదు సంవత్సరాలు పనిచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube