మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ రాకెట్, సగం దూరం ఎగిరి కిందకొచ్చేసింది... వివరాలివే!

మొట్టమొదటి సారిగా వందశాతం స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన త్రీడీ ప్రింటెడ్‌ రాకెట్‌( 3D printed rocket ) ప్రయోగం విజయవంతంగా ప్రదర్శించబడినట్లు స్కైరూట్‌ ఏరోస్పేస్‌( Skyroot Aerospace ) తాజాగా ప్రకటించింది.తెలంగాణకు చెందిన ఈ ఏరోస్పేస్‌ సంస్థ గత సంవత్సరం స్టార్టప్‌గా ఎదిగిన సంగతి తెలిసినదే.

 The First 3d Printed Rocket, Flew Half Way And Landed Details , 3d Printed Rock-TeluguStop.com

ఈ ప్రయోగాన్ని విక్రమ్‌సారాబాయ్‌ రాకెట్‌ ప్రయోగ స్టేషన్‌ తిరువనంతపురంలో అగ్నికుల్‌ అగ్నిలెట్‌ ఇంజిన్‌ సంస్థ 3డి టెక్నాలజీ ప్రింట్‌తో ప్రయోగాన్ని చేసింది.సారాబాయ్‌ రాకెట్‌ స్టేషన్‌ ప్రయోగాలు ఇస్రో సింగిల్‌విండో ఒప్పందంతో నడుస్తోన్న సంగతి తెలిసినదే.

కాగా ఈ ప్రయోగానికి కావాల్సిన మొత్తం సహాయ సహకారాలు ఇస్రో సమకూర్చినట్లు తెలుస్తోంది.

Telugu Rocket, Air Space, Latest, Telangana-Latest News - Telugu

ఈ సందర్భంగా అగ్నికుల్‌ వ్యవస్థాపకులు శ్రీనాథ్‌ రవిచంద్రన్‌( Srinath Ravichandran ) మాట్లాడుతూ… ఈ ప్రయోగ విజయం వారి ప్రయోగ ప్రయాణంలో మరచిపోలేని విజయంగా అభివర్ణించారు.ఆ సంస్థలో పనిచేసే టెక్నికల్‌ ఇంజినీర్స్‌ ప్రయోగాత్మకంగా ఒక ముందడుగు వేసి స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించినట్లు తెలిపారు.అనుభవజ్ఞులైన ఇంజినీర్ల పనితనమే ఈ త్రీడీ ప్రింట్‌ రాకెట్‌ ప్రయోగం విజయానికి కారణంగా ఆయన కొనియాడారు.

ఐఐటీ మద్రాస్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ అగ్నిలెట్‌ ఇంజిన్‌ ప్రయోగం 2021లోనే విజయవంతంగా ప్రదర్శించిందన్నారు.

Telugu Rocket, Air Space, Latest, Telangana-Latest News - Telugu

భారతదేశంలో పూర్తిగా తయారు చేయబడిన ఈ అగ్నిలెట్‌ ఇంజిన్‌ 2021లో ట్రెల్స్‌ ఇటీవల సింగిల్‌పీీస్‌ 3డీ ప్రింటెడ్‌ రాకెట్ల రూపకల్పన మరియు తయారీకి పేటెంట్‌ పొందడం విశేషం అని చెప్పుకోవాలి.ఇండియన్ స్పేస్ చరిత్రలో ఇదొక ముఖ్య ఘట్టమని చెప్పుకోవచ్చు.ఐఐటీ మద్రాస్‌ రీసెర్చ్‌ పార్క్‌లో ఇటువంటి రాకెట్‌ ఇంజిన్‌లను పెద్ద ఎత్తున ముద్రించడానికి దేశంలోనే మొట్టమొదటి రాకెట్‌ సదుపాయం అయిన రాకెట్‌ ఫ్యాక్టరీ1ని కూడా కంపెనీ ఆవిష్కరించింది.

సహ వ్యవస్థాపకుడు కూ మొయిన్‌ మాట్లాడుతూ… ప్రైవేట్‌ స్పేస్‌ ఎకోసిస్టమ్‌ సరైన దిశలో పెరుగుతోంది.దేశంలో ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేయడానికి మరియు పరీక్షించడానికి అత్యాధునిక సాంకేతికతలను పొందుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube