హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ లో టికెట్ వార్ జరుగుతోంది.ఈ మేరకు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వ్యతిరేక వర్గీయులతో మాజీ ఎంపీ అజారునద్దీన్ సమావేశం అయ్యారు.
కృష్ణానగర్ లో ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది.ఈ క్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు భవానీ శంకర్ తో అజారుద్దీన్ సమావేశం అయ్యారు.
అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే అజారుద్దీన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి తప్పకుండా విజయం సాధిస్తానని స్పష్టం చేశారు.
ఈ సమయంలో విష్ణు వర్ధన్ రెడ్డి వ్యతిరేక వర్గంతో అజారుద్దీన్ భేటీకావడం చర్చనీయాంశంగా మారింది.కాగా అజారుద్దీన్ ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొందని తెలుస్తోంది.