ప్రజలను మోసం చేసే వాళ్లను 420 అంటాం..: సీఎం జగన్

విజయనగరం జిల్లా చెల్లూరులో ‘మేమంతా సిద్ధం’ సభకు సీఎం జగన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం జగన్( CM Jagan ) ప్రసంగిస్తూ విజయనగరం జనసంద్రంగా మారిందని తెలిపారు.

 Those Who Deceive People Are Called 420 Cm Jagan , Cm Jagan, Chelluru, Vizianag-TeluguStop.com

రానున్న ఎన్నికలు మీ భవిష్యత్తును, మీ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు.ఈ క్రమంలో పెత్తందారులకు, కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలన్నారు.

ఈ ఎన్నికల రణరంగంలో జగన్ ఒకే ఒక్కడు కాదన్న ఆయన కోట్లమంది జనం తనతో ఉన్నారని తెలిపారు.ఇంటింటికీ చేసిన మంచి.

దేవుడి దయ తనకు ఉన్నాయని పేర్కొన్నారు.ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతున్నామన్నారు.

ఎన్నికల సమయంలో తియ్యని మాటలు చెప్పి… ప్రజలను మోసం చేసే వాళ్లను ఏమంటామని ప్రశ్నించారు.ప్రజలను మోసం చేసే వాళ్లను 420 అంటామన్న సీఎం జగన్ మళ్లీ మనలను దోచుకునేందుకు వచ్చిన ఈ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటామని విమర్శించారు.

ఈ క్రమంలో ప్రజలు ఆలోచించి మంచి జరుగుతుందంటేనే వైసీపీకి ఓటు వేయాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube