ప్రజలను మోసం చేసే వాళ్లను 420 అంటాం..: సీఎం జగన్

విజయనగరం జిల్లా చెల్లూరులో ‘మేమంతా సిద్ధం’ సభకు సీఎం జగన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం జగన్( CM Jagan ) ప్రసంగిస్తూ విజయనగరం జనసంద్రంగా మారిందని తెలిపారు.

రానున్న ఎన్నికలు మీ భవిష్యత్తును, మీ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఈ క్రమంలో పెత్తందారులకు, కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలన్నారు.

ఈ ఎన్నికల రణరంగంలో జగన్ ఒకే ఒక్కడు కాదన్న ఆయన కోట్లమంది జనం తనతో ఉన్నారని తెలిపారు.

ఇంటింటికీ చేసిన మంచి.దేవుడి దయ తనకు ఉన్నాయని పేర్కొన్నారు.

ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతున్నామన్నారు.ఎన్నికల సమయంలో తియ్యని మాటలు చెప్పి.

ప్రజలను మోసం చేసే వాళ్లను ఏమంటామని ప్రశ్నించారు.ప్రజలను మోసం చేసే వాళ్లను 420 అంటామన్న సీఎం జగన్ మళ్లీ మనలను దోచుకునేందుకు వచ్చిన ఈ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటామని విమర్శించారు.

ఈ క్రమంలో ప్రజలు ఆలోచించి మంచి జరుగుతుందంటేనే వైసీపీకి ఓటు వేయాలని తెలిపారు.

41 సంవత్సరాల వయస్సు వచ్చినా పెళ్లి చేసుకోని నటి.. చేసుకోకపోవడానికి కారణాలివే!