గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కిన డాన్ శీను మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.శ్రియ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ లో నటించగా శ్రీహరి కీలక పాత్రలో నటించారు.
ఇండస్ట్రీలో చాలా సందర్భాల్లో ఒక హీరో కొరకు తయారు చేసిన స్క్రిప్ట్ లో మరో హీరో నటించడం జరుగుతుంది.రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.
మొదట డాను శీను స్క్రిప్ట్ ను గోపీచంద్ మలినేని స్టార్ హీరో ప్రభాస్ కు వినిపించారట.స్టోరీ లైన్ విన్న ప్రభాస్ సినిమా చేద్దామని గోపీచంద్ మలినేనికి మాటిచ్చారు.
ఆ సమయంలో ప్రభాస్ దశరథ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటిస్తున్నారు.గోపీచంద్ మలినేనికి హీరో గోపీచంద్ రిలేటివ్ కాగా ఇదే కథను దర్శకుడు గోపీచంద్ కు కూడా వినిపించడం జరిగింది.
గోపీచంద్ కు కథ నచ్చినా అదే సమయంలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన గోలీమార్ సినిమాతో బిజీగా ఉండటంతో ఆ సినిమా చేయలేకపోయారు.

ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు డాన్ శీను మూవీ కథ విని ఈ కథ రవితేజకు బాగుంటుందని సూచించగా గోపీచంద్ మలినేని రవితేజకు కథ చెప్పి ఒప్పించడం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావడం జరిగింది.