పుష్ప పార్ట్ 2లో అదే హైలైట్ కానుందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

 Sister Sentiment To Be Highlight In Pushpa 2, Pushpa, Pushpa 2, Allu Arjun, Suku-TeluguStop.com

ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడో చిత్రం కావడంతో వారు ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది.

ఇప్పటికే మొదటి భాగం చివరిదశకు చేరుకోవడంతో, అప్పుడే రెండో భాగానికి సంబంధించిన సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తోంది.తాజాగా పుష్ప పార్ట్ 2లో ఏ అంశం హైలైట్ కానుందో అనే వార్తపై ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది.

పుష్ప పార్ట్ 2లో సిస్టర్ సెంటిమెంట్‌ను హైలైట్‌గా చూపించేందుకు సుకుమార్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.పుష్ప పార్ట్ 1లో ఎర్రచందనం స్మగ్లర్‌గా బన్నీ ఎలా ఎదుగుతాడని మనకు చూపించనున్న చిత్ర యూనిట్, సెకండ్ పార్ట్‌లో అసలు తాను అలా ఎందుకు మారుతాడనే అంశాన్ని రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా పుష్పరాజ్‌కు చెల్లి పాత్రలో ఓ యంగ్ బ్యూటీని తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యిందని, త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఉండబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మరి నిజంగా పుష్ప పార్ట్ 2లో సిస్టర్ సెంటిమెంట్‌ను హైలైట్ చేసి చూపిస్తారా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా పూర్తయ్యి రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

బన్నీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube