Tollywood Heros Father Movies: తండ్రులతో కలిసి సినిమాలు చేసిన హీరోలు వీళ్ళే.. ఎంత అదృష్టవంతులో?

మామూలుగా చాలామంది వారసులు సిని ఇండస్ట్రీకి పరిచయమై హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇక్కడ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా చాలామంది వారసులు పరిచయమయ్యారు.

 These Are The Heroes Made Films With Their Fathers Chiranjeevi Ram Charan Nagar-TeluguStop.com

తండ్రికి తగ్గ కొడుకులు గా పేరు సంపాదించుకొని ఒక రేంజ్ లో దూసుకుపోతున్నారు.హీరోయిన్ల కంటే ఎక్కువగా హీరోలే వారసులుగా అడుగుపెట్టారు.

టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, కృష్ణంరాజు ఇలా మరి కొంతమంది హీరోలు తమ వారసులతో కలిసి సినిమాలు చేసి మంచి సక్సెస్ లో అందుకున్నారు.నిజానికి రియల్ లైఫ్ తండ్రి కొడుకులు ఓకే సినిమాలో కలిసి నటిస్తే చూడ్డానికి బాగుంటుంది.

పైగా హీరోలకు కూడా తమ తండ్రులతో కలిసి చేయాలన్న కోరిక తీరితే అది అదృష్టమనే చెప్పాలి.అటువంటి అదృష్టాన్ని మన టాలీవుడ్ హీరోలు( Tollywood Heros ) దక్కించుకున్నారని చెప్పొచ్చు.ఇక ఈ తరం చెందిన హీరోలు తమతండ్రులతో, తమ వారసులతో కలిసి సినిమాలు చేయగా ఇంతకు ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చిరంజీవి – రామ్ చరణ్:

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) అతి తక్కువ సమయంలో తండ్రికి తగ్గ కొడుకుగా పేరు సంపాదించుకున్నాడు.ఇక ఈయన తన తండ్రి చిరంజీవితో ( Chiranjeevi ) కలిసి ఆచార్య, బ్రూస్ లీ సినిమాలు చేయగా.ఇందులో తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సంతోషంగా ఉందని గతంలో తెలిపాడు.

Telugu Acharya, Bangarraju, Chiranjeevi, Krishnam Raju, Mahesh Babu, Manchu Mano

మహేష్ బాబు – గౌతమ్ బాబు:

సూపర్ స్టార్ మహేష్( Mahesh Babu ) తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తో కలిసి ఎన్నో సినిమాలలో నటించాడు.ఇక తన కొడుకు గౌతమ్ తో కలిసి వన్ నేనొక్కడినే సినిమాలో నటించాడు.

Telugu Acharya, Bangarraju, Chiranjeevi, Krishnam Raju, Mahesh Babu, Manchu Mano

కృష్ణంరాజు – ప్రభాస్:

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) తన పెదనాన్న కృష్ణంరాజు తో కలిసి రెబల్, బిల్లా, రాధేశ్యామ్ సినిమాలలో నటించాడు.

Telugu Acharya, Bangarraju, Chiranjeevi, Krishnam Raju, Mahesh Babu, Manchu Mano

రవితేజ – మహానంద్:

మాస్ మహారాజ్ రవితేజ తన కొడుకు మహానంద్ తో కలిసి రాజా ది గ్రేట్ సినిమాలో కనిపించాడు.

Telugu Acharya, Bangarraju, Chiranjeevi, Krishnam Raju, Mahesh Babu, Manchu Mano

నాగార్జున – నాగచైతన్య:

నాగార్జున తన తండ్రి నాగేశ్వరరావు తో కలిసి చాలా సినిమాలలో చేశాడు.ఇక తన కొడుకు నాగచైతన్య తో కలిసి మనం, ప్రేమమ్, బంగార్రాజు వంటి సినిమాలలో నటించాడు.

Telugu Acharya, Bangarraju, Chiranjeevi, Krishnam Raju, Mahesh Babu, Manchu Mano

మోహన్ బాబు – మంచు మనోజ్:

మోహన్ బాబు కూడా తన కొడుకు మంచు మనోజ్ తో కలిసి పాండవులు పాండవులు తుమ్మెద, ఝుమ్మంది నాదం వంటి సినిమాలలో చేశాడు.ఇక మరో కొడుకు విష్ణు తో కలిసి రౌడీ, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలలో చేశాడు.

ఇక వీళ్లే కాకుండా ఎన్టీఆర్ తన కొడుకు బాలకృష్ణతో, హరికృష్ణతో కలిసి కూడా చాలా సినిమాలు చేశాడు.ఇక మరికొంతమంది హీరోలు కూడా త్వరలో తమ వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube