గొర్రె పిల్లను ఎత్తుకుని ముద్దు చేసిన యువతి.. చివరికి ఏమైందంటే

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు మనలను నవ్విస్తున్నాయి.స్మార్ట్ ఫోన్లు అందరి చేతుల్లోకి వచ్చాక ఇంటర్‌నెట్ వాడకం విపరీతంగా పెరిగింది.

 The Young Woman Who Picked Up The Lamb And Kissed It , Sheep , Viral Latest, Ne-TeluguStop.com

ఇక వివిధ రకాల యాప్‌లు ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకునేలా సౌకర్యం కల్పిస్తున్నాయి.ఫలితంగా ఏ ఆసక్తికర సంఘటన జరిగినా, అందరికీ చూపించడానికి ప్రజలు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

చాలా వీడియోలు ఫన్నీగా ఉంటున్నాయి.అవి ఎంతో ఆసక్తికరంగానే కాకుండా చూడగానే నవ్విస్తున్నాయి.

బాగా ఆందోళనగా ఉన్నప్పుడు, మనసు బాగాలేనప్పుడు ఇలాంటి వీడియోలు చూడగానే మనసు ఆహ్లాదకరంగా మారుతుంది.ఇలాంటి తరహాలో ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కొందరు యువతులు ఓ అటవీ ప్రాంతానికి వెళ్తారు.

అక్కడ ఉన్న ఓ పాకలో గొర్రెలు ఉంటాయి.అందులో అప్పుడే పుట్టిన ఓ గొర్రె పిల్లను ఓ యువతి ఎత్తుకుంది.

అది ఎంతో ముద్దుగా ఉండడంతో దానిని ఎత్తుకుని, అటూ ఇటూ ఆడించింది.ఈ తంతంగాన్ని తల్లి గొర్రె చూసింది.

తన పిల్లను వారు ఎత్తుకు పోతున్నారేమోనని భావించింది.కోపంగా వచ్చి, తన పిల్లను ఎత్తుకున్న ఆ అందమైన యువతిని వెనుక నుంచి గుద్దింది.

ఒక్కసారిగా ఆ గొర్రె గుద్దడంతో ఆ యువతి చేతిలోని గొర్రె పిల్ల జారి కింద పడింది.ఇక తగిలిన దెబ్బను తలచుకుని ఆ యువతి ఎంతో బాధపడింది.

నా పిల్ల జోలికొస్తే ఊరుకుంటానా అన్నట్లు ఉన్న తల్లి గొర్రెను చూసి యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది.ఈ వీడియోను బ్యూటీ వైల్డ్ లైఫీ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు.

ఎంతో ఫన్నీగా ఉండడంతో నెటిజన్లు ఆ వీడియోను చూసి నవ్వుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube