యూఎస్ఎ టీన్ టైటిల్ వదులుకున్న ఎన్నారై యువతి.. ఎందుకంటే..

మిస్ టీన్ యుఎస్ఏ 2023( Miss Teen USA 2023 ) బిరుదును గెలుచుకున్న ఉమసోఫియా శ్రీవాస్తవ( UmaSofia Srivastava ) తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆ బిరుదును వదిలిపెట్టాలని నిర్ణయించుకుంది.

 The Young Nri Girl Who Gave Up The Usa Teen Title Because , Nri News, Umasofia S-TeluguStop.com

ఈమె ఈ బిరుదును ఎనిమిది నెలల క్రితమే గెలుచుకుంది.కనీసం ఒక సంవత్సరం కూడా ఆ బిరుదును ఉంచుకోకుండా ఆమె వదిలిపెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈమె టైటిల్ ఒక్కరే కాదు రెండు రోజుల క్రితం మిస్ యుఎస్ఏ 2023 నోలియా వోయిగ్ట్ కూడా తన బిరుదును వదిలిపెట్టింది.ఉమసోఫియా 2007 జూన్ 5న న్యూజెర్సీ, యుఎస్ఏలో జన్మించింది.మిస్ న్యూజెర్సీ టీన్ యుఎస్ఏ( Miss Teen USA ) బిరుదును గెలుచుకున్న మొదటి మెక్సికన్-ఇండియన్ అమెరికన్‌గా రికార్డు క్రియేట్ చేసింది.2023లో మిస్ టీన్ యుఎస్ఏ పేజెంట్‌లో కూడా గెలిచి వావ్ అనిపించింది.తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఉమసోఫియా తన నిర్ణయం గురించి ప్రకటించింది.ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని, తన నమ్మకాలు సంస్థ దిశతో సరిపోవడం లేదని ఉమసోఫియా చెప్పింది.

Telugu Teen Usa, Jersey, Nri-Latest News - Telugu

ఉమసోఫియా స్కూల్లో ఇతరులకు సహాయం చేయడంలో చురుకుగా ఉంటూ మంచి మనసున్న యువతిగా పేరు తెచ్చుకుంది.భారతదేశంలోని పిల్లలకు విద్య, ఆహారం, వైద్యం అందించేందుకు ఆమె “లోటస్ పెటల్ ఫౌండేషన్”తో కలిసి పనిచేస్తుంది.వైవిధ్యం, సమానత్వం కోసం కూడా ఆమె పోరాటం చేస్తుంది.మోడల్ యుఎన్, మాక్ ట్రయల్స్ వంటి కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది.లోటస్ పెటల్‌తో పాటు, “uEmpower”, “స్మైల్ ట్రైన్” వంటి ఇతర సంస్థలకు కూడా ఆమె ప్రతినిధి.

Telugu Teen Usa, Jersey, Nri-Latest News - Telugu

ఇంగ్లీష్, స్పానిష్, హిందీ, ఫ్రెంచ్ ఇలా నాలుగు భాషలు మాట్లాడే ఉమసోఫియాకి భాషలంటే చాలా ఇష్టం.ఈ ఇష్టంతోనే “ది వైట్ జాగర్” అనే పిల్లల పుస్తకాన్ని కూడా రాసింది.“థాట్స్ ఫ్యాన్ బిహేవియర్” అనే బ్లాగ్ కూడా నడుపుతోంది.అందులో ఆమె జీవితం గురించి, ప్రస్తుత సంఘటనల గురించి తన అభిప్రాయాలను పంచుకుంటుంది.సేవా కార్యక్రమాలతో పాటు పియానో వాయించడం కూడా ఉమసోఫియాకు ఇష్టమే.11వ తరగతి చదువుతున్న ఆమె “నేషనల్ హానర్ సొసైటీ” సభ్యురాలు.కాలేజీకి దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతోంది.

న్యూజెర్సీలోని అవసరమైన పిల్లలకు “బ్రిడ్జ్ ఆఫ్ బుక్స్ ఫౌండేషన్” ద్వారా 1000 పుస్తకాలను దానం చేసి మంచి మనసు చాటుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube