తెలంగాణ సచివాలయంలో( Telangana Secretariat ) వాస్తు మార్పులపై సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రత్యేక దృష్టి సారించారు.ఈ మేరకు వెస్ట్ గేట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి లోపలికి వచ్చేలా మార్పులు చేర్పులు చేస్తున్నారని సమాచారం.
ఇకపై ఈశాన్య గేటు నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయటికి వెళ్లనున్నారు.అదేవిధంగా ఆరో అంతస్తు నుంచి తొమ్మిదో అంతస్తుకు సీఎం కార్యాలయాన్ని( CM Office ) మార్చనున్నారని తెలుస్తోంది.
కాగా ఇందుకు సంబంధించిన వాస్తు మార్పు పనులు శరవేగంగా సాగుతున్నాయి.







