తెలంగాణలోని వర్షాలపై అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Minister Tummala Nageswara Rao ) అప్రమత్తం చేశారు.ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులను అలర్ట్ చేశారు.
తెలంగాణలో వచ్చే 3, 4 రోజుల్లో అనేక జిల్లాల్లో( Rains ) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మంత్రి తుమ్మల తెలిపారు.ఇప్పటికే అన్ని జిల్లాలకు సరఫరా చేసిన పచ్చరొట్ట, పత్తి విత్తనాల ప్యాకెట్లు రైతులకు( Farmers ) అందేలా చూడాలని పేర్కొన్నారు.
ఇంకా అవసరమైన పత్తి ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు.కాగా ఇప్పటివరకు 84,43,474 ప్యాకెట్ల పత్తి విత్తనాలు( Cotton Seeds ) అందించామని తెలిపారు.అనుమతి లేకుండా పత్తి విత్తనాలు విక్రయిస్తున్న 33 మందిపై కేసులు నమోదు చేశామన్న మంత్రి తుమ్మల నిందితుల నుంచి 118.29 క్వింటాళ్ల విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.