ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ ఏకంగా అన్ని దేశాల్లో ప్లాన్ చేశారా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వ‌రుసగా సినిమాల‌లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.ఒకవైపు కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తూనే మరొకవైపు బాలీవుడ్ చిత్రం వార్ 2(War 2)లోనూ న‌టిస్తున్నారు.

 Ntr 31 Movie Shoot Is Expected To Happen In Approximately 15 Countries, Ntr, Ntr-TeluguStop.com

ఈ రెండు సినిమాల త‌రువాత ప్ర‌శాంత్ నీల్(Prashant Neil) ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్(NTR) ఒక చిత్రంలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.ఎప్పటినుంచో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.

ఆగ‌స్టు నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని ఇప్ప‌టికే చిత్ర బృందం వెల్ల‌డించింది.ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఒక వార్త వైర‌ల్ గా మారింది.అదేమిటంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్(NTR , Prashant Neil) దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా దాదాపు 15 దేశాల్లో ఎన్టీఆర్ 31 ( NTR 31)షూటింగ్ జ‌ర‌గ‌నుంద‌ట‌.

ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లు అయ్యాయ‌ని అంటున్నారు.ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్ లో మెక్సికోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంద‌ట‌.భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనున్న‌ట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

కాగా ప్ర‌స్తుతం ఎన్టీఆర్ దేవ‌ర పార్ట్ 1(NTR Devara Part 1)తో బిజీగా ఉన్నాడు.కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.అక్టోబ‌ర్ 10న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube