ఎన్టీఆర్( NTR ) హీరోగా కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వం లో వస్తున్న దేవర సినిమా( Devara Movie ) మీద రకరకాల కామెంట్లైతే వస్తున్నాయి.అయితే ఈ సినిమా అనుకున్నట్టుగా రావడం లేదని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రమే ఈ సినిమా అంచనాలకు మించి చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తుందని చెబుతున్నారు.
అయితే ఏది ఏమైనా కూడా ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ సినిమా మీద సగటు ప్రేక్షకులకి అంచనాలైతే తగ్గిపోతున్నాయనే చెప్పాలి.

ఇక ఈ నెల లో ఎన్టీయార్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ గా( Devara First Single ) వచ్చిన సాంగ్ కూడా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదు.ఇక అందులో ఉన్న లిరిక్స్ మాత్రం ఏవి కూడా ప్రేక్షకులకు అర్థం కాకపోవడమే ఆ పాటకి చాలా వరకు మైనస్ గా మారింది.మరి ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్ దేవర సినిమా కోసం ఎందుకు అంత ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నాడు.
ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే దొరకడం లేదు.ఇక మొత్తానికైతే ఈ సినిమాని కనక సూపర్ సక్సెస్ చేసినట్లయితే ఎన్టీఆర్ కి కొరటాల శివ కు మంచి పేరు అయితే వస్తుంది.

కానీ ఒకవేళ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోతే మాత్రం సినిమా మీద పెడుతున్న ఎఫర్ట్స్ గాని ఆయన టైమ్ కానీ చాలా వరకు వేస్ట్ అయిపోతుంది అంటూ చాలామంది సినీ పండితులు సైతం ఎన్టీఆర్ ని హెచ్చరిస్తున్నారు.ఇక ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ కొరటాల శివ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ ఉండడం విశేషం… ఇక ఈ సినిమా అవుట్ ఫుట్ బాగా రావడం కోసమే వీళ్లు చాలా టైమ్ తీసుకొని మరి వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అనేది…
.





 

