హష్ మనీ ట్రయల్‌ : దోషిగా తేలిన డొనాల్డ్ ట్రంప్.. ఈ దేశాలు అడుగుపెట్టనిస్తాయా

అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌‌ను( Donald Trump ) న్యూయార్క్ కోర్ట్ దోషిగా తేల్చడం హాట్ టాపిక్‌గా మారింది.రాజకీయంగానూ ఇది ఆయనకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

 Hush Money Verdict Donald Trump May Banned From A Host Of Countries Including Ca-TeluguStop.com

జూలై 11న ట్రంప్‌కు న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది.అయితే అంతర్జాతీయంగానూ ఆయన పరువు ప్రతిష్టలపై ఈ కేసు తీవ్ర ప్రభావం చూపుతోంది.

ట్రంప్ దోషిగా తేలినందున కొన్ని దేశాలు ఆయనపై ఆంక్షలు విధించే అవకాశం లేకపోలేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Telugu America, Canada, China, Donald Trump, Hush Trial, Hush Verdict, India, Is

అమెరికాకు మిత్రపక్షాలైన కెనడా,( Canada ) యూకేతో( UK ) పాటు దాదాపు 40 దేశాలు నేర చరిత్ర కలిగిన వ్యక్తులను తమ భూభాగంపై అనుమతించే విషయంలో కఠినమైన విధానాలను కలిగి ఉన్నాయి.ప్రత్యేక వసతిని మినహాయించి ఇప్పుడు ట్రంప్ కూడా అదే నిబంధనలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది.నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( US Presidential Elections ) గెలిస్తే ట్రంప్‌ పర్యటనలను ఆయా దేశాలు అనుమతిస్తాయా లేదా అన్నది అనుమానంగా ఉంది.

పైన పేర్కొన్న దేశాల్లో ప్రస్తుతానికి కేవలం ఐదు మాత్రం ట్రంప్ ప్రవేశాన్ని నిషేధించవచ్చు.అవి ఇజ్రాయెల్, కెనడా, జపాన్, యూకే, చైనా. ఆశ్చర్యకరంగా పై లిస్ట్‌లో ఇండియా( India ) కూడా ఉండటం గమనార్హం.

Telugu America, Canada, China, Donald Trump, Hush Trial, Hush Verdict, India, Is

మరోవైపు.ఈ కేసులో కోర్టు తీర్పు వెలువడిన గంట తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన విరాళాల పేజీకి భారీ ట్రాఫిక్ నమోదై క్రాష్ అయ్యింది.ట్రంప్‌కు విరాళాలు ఇవ్వాలని అమెరికన్లు నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం.

జ్యూరీ ట్రంప్‌ను దోషిగా తేల్చిన తర్వాత .ఆయన ప్రచార బృందం ట్రూత్ సోషల్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.‘ నేను రాజకీయ ఖైదీని, కఠినమైన రాజకీయ మంత్రగత్తె వేటలో దోషిగా తేలాను, నేనేమి తప్పు చేయలేదు ’’ అంటూ ట్రంప్ నేషనల్ కమిటీ జాయింట్ ఫండ్ రైజింగ్ కమిటీ పేర్కొంది.మాజీ అధ్యక్ష సలహాదారు క్రిస్ లాసివిటా మాట్లాడుతూ.

ఈ క్రాష్ చాలా మంచి సంకేతమన్నారు.మిలియన్లకొద్దీ అమెరికన్ దేశభక్తులు డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి విరాళాలు ఇవ్వాలనుకుంటున్నారని ప్రశంసించారు.

దాదాపు 800K డాలర్లు ట్రంప్ ప్రచార పేజీకి విరాళంగా వచ్చినట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube