అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌కు( Donald Trump ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది.హష్ మనీ ట్రయల్ (శృంగార తార స్టార్మీ డేనియల్ కేసు)లో ఆయనను న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది.
దాదాపు 34 అంశాల్లో ట్రంప్‌ను దోషిగా నిర్ధారించగా .జూలై 11న ఆయనకు న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది.ఇలా ఓ కేసులో దోషిగా తేలిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం.మరో ఐదు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ కోర్టు తీర్పు అమెరికా రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
దీంతో ట్రంప్ జైలుకెళ్తారా, అధ్యక్ష రేసులో వుంటారా లేదా అన్న చర్చ జరుగుతోంది.ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందించారు.
తాను జైలుకు( Jail ) వెళ్లడానికైనా .హౌస్ అరెస్ట్‌కైనా( House Arrest ) సిద్ధమేనని స్పష్టం చేశారు.ఆదివారం ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.తన శిక్ష ప్రజలకు బ్రేకింగ్ పాయింట్ అంటూ వ్యాఖ్యానించారు.తనకు శిక్ష విధిస్తే ప్రజలకు కష్టంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.ప్రజానీకం దానిని తట్టుకోలేదని, తనకోసం నిలబడతారా లేదా అనేది తనకు ఖచ్చితంగా తెలియదని ట్రంప్ అన్నారు.
తాను రాజ్యాంగం కోసం పోరాడుతున్నానని.అయితే ఈ తీర్పు తన కుటుంబానికి, ముఖ్యంగా తన భార్య మెలానియాకు( Melania ) కఠినమైనదిగా ఆయన అభివర్ణించారు.
కీలకమైన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు( Republican National Convention ) నాలుగు రోజుల ముందు జూలై 11న ఉదయం 10 గంటలకు ట్రంప్‌కు శిక్ష ఖరారు చేస్తామని న్యాయమూర్తి జువాన్ మోర్చాన్ తెలిపారు.హష్ మనీ ట్రయల్‌లో( Hush Money Trial ) ట్రంప్‌కు గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు ప్రతి కౌంట్ నేరంపై పరిశీలన లేదా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
కాగా.శృంగార తార స్టార్మీ డేనియల్‌తో( Stormy Daniel ) ట్రంప్ సన్నిహితంగా గడిపారని ఆరోపణలు ఎప్పటి నుంచో వస్తున్నాయి.2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె ఈ సంగతి బయటపెట్టకుండా ఉండేందుకు ట్రంప్ భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పారని , తన లాయర్ ద్వారా స్టార్మీకి సొమ్ము అందజేశారని అభియోగాల్లో పేర్కొన్నారు.ప్రచారం కోసం అందిన విరాళాల నుంచి ట్రంప్ ఈ మొత్తాన్ని కేటాయించారని ఆరోపించారు.
ఇందుకోసం వ్యాపార రికార్డులను తారుమారు చేశారని కూడా ట్రంప్‌పై మొత్తంగా 34 అభియోగాలు మోపారు.మరోవైపు ట్రంప్‌తో తనకు అక్రమ సంబంధం ఉన్నట్లు స్టార్మీ న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు.