టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyans) గురించి మనందరికీ తెలిసిందే.పవన్ కళ్యాణ్ గురించి ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పవన్ తో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన గురించి గొప్పగా చెబుతూ ఉంటారు.కేవలం సినిమాల పరంగానే కాకుండా రాజకీయపరంగా కూడా ఆయనను అభిమానించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
కాగా పిఠాపురం నుంచి పోటీ చేయాలని వర్మ(varma) ఎంతో ప్రయత్నించారు.విపక్షంలో ఉండగా వైసీపీ వేధింపులు, ఒత్తిడిని తట్టుకుని మరి పార్టీని పట్టిష్టం చేశారు.

అయితే కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పిఠాపురం నియోజకవర్గాన్ని(Pithapuram Constituency) జనసేనకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరారు.అయితే వర్మను కాదని పిఠాపురం సీటును పవన్‌కు ఎలా కేటాయిస్తారంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒకానొక దశలో వర్మ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతారన్న ప్రచారం కూడా జరిగింది.అయితే ఆయన సత్తా, శక్తి సామర్ధ్యాలు ఏంటో తెలిసిన చంద్రబాబు(Chandrababu) తక్షణం వర్మను పిలిపించి మాట్లాడారు.
చంద్రబాబు హామీతో మెత్తబడిన వర్మ.పిఠాపురంలో పవన్ కళ్యాణ్( pawan kalyan) గెలుపు కోసం ఎంతో శ్రమించారు.
పవన్‌ను ఓడించడానికి సీఎం జగన్(CM Jagan) వేసిన ఎత్తుగడలు, వ్యూహాలను ధీటుగా తిప్పికొట్టడంలో వర్మ కీలకపాత్ర పోషించారు.

పవన్‌ను ఎన్నికల్లో ఓడించాలని తనకు భారీ మొత్తం ఆఫర్ చేశారని వ్యాఖ్యానించారు.పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అనగానే చాలా ఒత్తిళ్లు వచ్చాయని.కానీ తనను ఎవ్వరూ కొనలేరని వర్మ స్పష్టం చేశారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం వారిద్దరితో పాటు నేను కూడా పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు.అంతేకాకుండా తాజాగా పవన్ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పారు టీడీపీ(TDP) సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మ.
ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.ఒక సారి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లగా అక్కడ కూర్చొని ఉండమని అన్నారు.
ఇంతలో తనకు గొంతులో ఏదో తేడాగా ఉండటంతో ఇబ్బందిగా అనిపించిందని, తన పరిస్ధితిని గమనించిన పవన్ లేచి అక్కడే ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి తాగమన్నారని వర్మ తెలిపారు.ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు పనివాళ్లను పిలవడమో, లేదంటే కాలింగ్ బెల్ నొక్కుతారని కానీ పవన్ మాత్రం తన హోదాను, స్టార్ డమ్‌ను పక్కనబెట్టి ఎదుటివాళ్లని గౌరవిస్తారని వర్మ ప్రశంసించారు.
ఈ సందర్భంగా వర్మ చేసిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.








