చరణ్ ఉపాసనల కూతురికి బహుమతి పంపిన కల్కి టీమ్.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు.అందులో గత ఏడాది సలార్‌ తో పలకరించిన విషయం తెలిసిందే.

 Prabhas Kalki Team Gifts To Ram Charan Upasana Daughter Klin Kaara Details, Prab-TeluguStop.com

గత ఏడాది డిసెంబర్ 22న విడుదల అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ ను అందుకుంది.ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ప్రభాస్ నటించిన మూవీ కల్కి.

( Kalki ) సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించింది.

కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ కీలకపాత్రలో నటించారు.కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.ఈ సినిమా నుంచి బుజ్జి( Bujji ) అనే వాహనాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న సందర్భంగా ఈ సినిమాపై ఆసక్తిని పెంచడం కోసం మూవీ మేకర్స్ కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే బుజ్జి వాహన బొమ్మలు, భైరవ స్టిక్కర్స్, టీ షర్ట్స్‌ను విక్రయిస్తున్నారు.అలాగే, వాటిని సెలబ్రిటీ పిల్లలకూ గిఫ్టులుగా పంపిస్తూ సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారు.

తాజాగా రామ్ చరణ్ కూతురు క్లీంకారకు( Klin Kaara ) కూడా ఈ బహుమతులు అందాయి.థ్యాంక్స్ కల్కి టీమ్.ఆల్ ది బెస్ట్ అంటూ క్లీంకార.బుజ్జి బొమ్మతో ఆడుకుంటున్న ఫొటోను ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది.ఆ పోస్ట్ పై రాంచరణ్ అభిమానులు అటు ప్రభాస్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube