తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ తన కంతు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు.ఇంకా ఇప్పుడు ఆయన పుష్ప 2 సినిమాతో( Pushpa 2 ) చాలా బిజీగా ఉండడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవరికి లేనంత క్రేజ్ ని కూడా సొంతం చేసుకున్నాడు.
ఇక పుష్ప సినిమాతో “నేషనల్ అవార్డు” ని కూడా దక్కించుకొని తెలుగు హీరోల్లో ఎవ్వరికి సాధ్యం కానీ ఘనతని తన పేరిట నమోదు చేసుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఈయన ప్రస్తుతం సుకుమార్( Sukumar ) డైరెక్షన్ లో చేస్తున్న పుష్ప 2 సినిమా మీద చాలా అంచనాలైతే ఉన్నాయి.ఇక ఈ సినిమా దాదాపు 1500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈయన నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద క్లారిటీ అయితే లేకపోవడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ ఏంటి అంటూ చాలామంది విమర్శకులు విమర్శలు చేస్తున్నారు.
అయితే ఆయన లైనప్ లో ఇప్పటికే త్రివిక్రమ్,( Trivikram ) అట్లీ( Atlee ) లాంటి డైరెక్టర్లు ఉన్నారు.మరి వీళ్ళిద్దరితో సినిమా చేస్తాడా లేదంటే ఇంకో దర్శకుడి తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇక వీళ్లతో పాటుగా బోయపాటి శ్రీను తో( Boyapati Srinu ) కూడా అల్లు అర్జున్ ఒక సినిమా చేయాల్సి ఉంది.మరి అతనితో ఒక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాని చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే వీళ్ళ కాంబో లో సరైనోడు అనే సినిమా వచ్చింది.ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో వీళ్ళ కాంబో మీద అంచనాలైతే పెరిగిపోయాయి…చూడాలి మరి వీళ్లలో అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడు అనేది…
.