అమెరికా గన్ కల్చర్ ను, ప్రభుత్వాన్ని శాసిస్తున్న “ఎన్ఆర్ఏ”

అగ్ర రాజ్యం అమెరికా ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరిస్తోంది.ఆఫ్ కోర్స్ ప్రస్తుతం రష్యా, చైనా అమెరికాను తలదన్నే వ్యూహాలలో బిజీ బిజేగా ఉంటున్నయనుకోండి.

 The Nra That Governs American Gun Culture And Government , Nra , Gun Culture-TeluguStop.com

ప్రస్తుతానికి మాత్రం అమెరికా అగ్ర రాజ్యమే.అధునాతనమైన టెక్నాలజీ, ఏ రంగంలోనైన సరే అన్ని దేశాలకంటే ముందు ఉండేలా అమెరికాను నడిపిస్తున్న అద్భుత నైపుణ్యం కలిగిన నిపుణులు, అపారమైన టెక్ రంగం, ఆర్ధికంగా బలమైన దేశంగా, ఇలా ఏ విషయంలోనైనా సరే అన్ని దేశాలకంటే అమెరికా ముందు వరుసలో, ప్రపంచ దేశాలను శాసించే స్థానంలో అమెరికా ఉంటోంది…అయితే.

అమెరికాలో గన్ కల్చర్ ను మాత్రం అక్కడి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకూ కట్టడి చేయలేక పోయింది.ప్రపంచాన్ని శాసించే సత్తా ఉన్న అమెరికాకు అక్కడి గన్ కల్చర్ అతి పెద్ద తలనెప్పిగా మారడానికి కారణం ఏంటి, ఏ ప్రభుత్వం కూడా గన్ కల్చర్ ను నియంత్రించేలా చట్టాలను ఎందుకు తీసుకురాలేక పోతోంది అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి.

అసలు అమెరికా ప్రభుత్వం గన్ కల్చర్ ను ఎందుకు నియంత్రించలేకపోతోందంటే.అందుకు ప్రధాన కారణం అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఏ ( నేషనల్ రైఫిల్ అసోసియేషన్)సంస్థ.

Telugu American, China, Gun, National Rifle, Nra, Russia-Telugu NRI

అమెరికాఅంతర్యుద్దంలో పాల్గొన్న ఇద్దరు సైనికులు తుపాకి సంస్కృతిని విస్తృత ప్రచారం చేసి అక్కడి ప్రజలు తమని తాము రక్షించుకునేలా 1871 లో స్థాపించ బడిన ఏకైక సంస్థ ఇది.అయితే ప్రస్తుతం అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు అయినా సరే అప్పుడు ఏర్పాటు చేసిన గన్ కల్చర్ సదరు సంస్థ కారణంగా ఇప్పటికి కొనసాగుతోంది.అంతేకాదు ఈ సంస్థలో రాజకీయ నాయకులు, ప్రఖ్యాత సినిమా యాక్టర్స్ సభ్యులుగా కొనసాగుతున్నారు.ప్రభుత్వం గన్ కల్చర్ ను నియంత్రించలానే తలంపు వచ్చిన వెంటనే ఎన్ఆర్ఏ లాబియింగ్ ద్వారా ఆ నిర్ణయాలను నిలిపివేసేలా చేస్తుంది.

ఈ సంస్థ నుంచీ ఎంతో మంది చట్ట సభ్యులకు భారీ తాయిలాలు కూడా అందుతాయనే ప్రచారం కూడా ఉంది.ఈ సంస్థకు అమెరికాలో మరే సంస్థకు లేనంత భారీ నిధులు ఉన్నాయని అందుకే గన్ కల్చర్ ను పెంచి పోషించగలుగుతోందని నిపుణులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube