తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది.ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.అయితే సిట్ విచారణకు నిందితులు సహకరించడం లేదని ఏజీ కోర్టుకు తెలిపారు.
ఈ కేసులో ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందన్నారు.బీఎల్ సంతోష్ విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.
దీనిపై ఆయన గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని బీజేపీ తరపు న్యాయవాది వెల్లడించారు.ఈ క్రమంలో సుప్రీం ఆదేశాలతో పాటు సిట్ నోటీసులపై మధ్యాహ్నం విచారిస్తామని హైకోర్టు తెలిపింది.