ఈ ప్రపంచంలో డాక్టర్లని ప్రత్యక్ష దైవం అని అంటారు.ఎందుకంటే ప్రాణాలు పోయాలన్నా, తీయాలన్నా వారే కనుక.
ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని చూస్తే ప్రాణం పోసిన దేవతలాగా కనబడుతోంది.ఆగ్రాలోని ఒక ప్రభుత్వాసుపత్రిలో ఒక మహిళ, పండంటి శిశువుకు జన్మనిచ్చింది.
అయితే, పుట్టిన తర్వాత ఆ శిశువు ఏడ్వడంగానీ, కదలడం గానీ చేయలేదు.ఆ చిన్నారి బతకాలంటే అత్యవసర వైద్యం అవసరం.
కానీ, అక్కడ ఆక్సిజన్ మెషీన్ కూడా పనిచేయడం లేదు.ఈ సమయంలో అక్కడి డాక్టర్ సమయస్ఫూర్తితో ఆ చిన్నారికి ప్రాణాలు పోసింది.
అవును, డా.సురేఖా చౌదరి అనే డాక్టర్.తన నోటితో చిన్నారి నోట్లోకి గాలిని ఊది, వీపుపై తడుతూ అత్యవసర చికిత్స అందించింది.ఈ చికిత్స చేయడం వలన చిన్నారిలో మెల్లమెల్లగా కదలికలు వచ్చాయి.
ఆ పాప పుట్టిన ఏడు నిమిషాల తర్వాత కదిలి, డాక్టర్ వంక చూడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.కాగా తన బాధ్యతను చక్కగా నిర్వర్తించి, ఒక చిన్నారికి ప్రాణం పోసిన డాక్టర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి వీడియోని సోషల్ మీడియాలో నెటిజన్లు చూసి చప్పట్లు కొడుతున్నారు.అనేకరకాల కామెంట్లతో ఆమెని పొగిడేస్తున్నారు.ప్రత్యక్ష దైవం.అని ఒకరు పొగిడితే, ప్రాణం పోయాలంటే అమ్మ తరువాత డాక్టర్ కే సాధ్య పడుతుంది.ఒకరు కామెంట్ చేసారు.ఇంకొకరైతే ఏకంగా ఆమె కనబడితే గుడి కట్టి ఆరాధిస్తాను అని కామెంట్ చేసాడు.
ఇంకెందుకాలస్యం, మీరు కూడా సదరు వీడియోని చూసి కామెంట్ చెయ్యండి మరి!
.