చిరంజీవిగా పుట్టి 44 ఏళ్ళు.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన చిరు!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ అంటే ఇది ఒక బిరుదు మాత్రమే కాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇది ఒక బ్రాండ్ అని చెప్పవచ్చు.

 Megastar Chiranjeevi Completed 44 Years Film Industry ,megastar Chiranjeevi , Ch-TeluguStop.com

హీరోగా దాదాపు 150 కి పైగా సినిమాలలో నటించి రెండు తెలుగు రాష్ట్రాలలో కోట్లాదిమంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నాడు.రియల్ లైఫ్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరోగా అనిపించుకున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.

కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా కూడా నటించి మెప్పించారు.

ఆ తర్వాత హీరోగా అంచలంచలుగా ఎదుగుతూ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు.కాగా మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 44 ఏళ్లు పూర్తి అయ్యింది.మెగాస్టార్ మొదటగా ప్రాణం ఖరీదు అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమా విడుదల అయ్యి 44 ఏళ్ళు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.

మీకు తెలిసిన ఈ చిరంజీవి, చిరంజీవిగా పుట్టిన రోజు నేడు.ఈ రోజు 22 సెప్టెంబర్‌ 1978.

ప్రాణం ఖరీదు ద్వారా ప్రాణం పోసి.ప్రాణప్రదంగా నా ఊపిరై.

నా గుండె చప్పుడై అన్ని మీరే అయి 44 సంవత్సరాలు నన్ను నడిపించారు.నన్నింతగా ఆదిరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ చేతులు జోడించిన ఎమోజీలను జత చేశారు మెగాస్టార్ చిరంజీవి.

ఈ ట్విట్ ని చూసి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు.అంతే కాకుండా మెగాస్టార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసు దాటినా కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఆచార్య సినిమాతోపేక్షకులను పలకరించిన చిరంజీవి.

ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ చవిచూడడంతో తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు.మెగాస్టార్ చేతి నిండా బోలెడు ప్రాజెక్టులో ఉన్నాయి.

గాడ్‌ ఫాదర్‌, భోళా శంకర్‌ సినిమాలతో పాటు బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube