Bhanumati: 70 ఏళ్ళ క్రితమే పాన్ ఇండియా సినిమా డైరెక్ట్ చేసిన భానుమతి….పేరేమిటో తెలుసా ?

ప్రస్తుతం మన భారత దేశ చలన చిత్ర రంగంలో పాన్ ఇండియా సినిమాల( Pan India Movies ) ట్రెండ్ నడుస్తుంది.రాజమౌళి తెరకెక్కించిన కళాఖండం “బాహుబలి” తో మొదలైన ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది.

 Bhanumati First Pan Indian Movie-TeluguStop.com

ఐతే 70 ఏళ్ళ క్రితమే ఈ ప్రయత్నం చేసారు భానుమతి గారు.భానుమతి గారు( Bhanumati ) ఎవరో ఈ తరం యువతకు తెలియకపోవచ్చు.

నటసింహం బాలకృష్ణ హీరోగా సుహాసిని హీరోయిన్ గా తెరకెక్కిన “మంగమ్మగారి మనవడు”( Mangammagari Manavadu ) చిత్రంలో మంగమ్మ పాత్ర లో నటించిన వారే భానుమతి.భానుమతి గారి ఖ్యాతి అమరం.

అంతగా ఆమె ఏం సాధించింది అనుకుంటున్నారా? ఐతే ఇది చూడండి.

Telugu Bhanumati, Bhanumatipan, Bharani Studios, Chandirani, Nandamuritaraka, Pa

భానుమతి గారు కేవలం ఒక నటి మాత్రమే కాదు.ఆమె ఒక దర్శకురాలు, రచయిత్రి, ఎడిటర్, సంగీత దర్శకురాలు, సుప్రసిద్ధ గాయని.ఇలా ఆమెకు రాని పని లేదు.

అప్పట్లో ఆమెకు “అష్టావధాని”( Astavadhani ) అని పేరు.భానుమతి గారు తన జీవితంలో 100 కు పైగా చిత్రాలలో నటించారు.10 చిత్రాలకు దర్శకత్వం వహించారు.వందల కొద్దీ పాటలు పాడారు.

తెలుగు సినిమా చరిత్రలో మొదటి ఫిమేల్ డైరెక్టర్ భానుమతి గారు. ఐతే భానుమతి గారి కెరీర్ లో మరో ఆసక్తికర విషయం ఉంది.అదేమిటంటే….

Telugu Bhanumati, Bhanumatipan, Bharani Studios, Chandirani, Nandamuritaraka, Pa

భానుమతి గారు 70 ఏళ్ళ క్రితమే ఒక పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించారు.అదే “చండీరాణి”.( Chandirani Movie ) ఇది భానుమతి గారు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం.పి.స్.రామకృష్ణారావు గారు, భరణి స్టూడియోస్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు.సి.ఆర్.సుబ్బురామన్, ఎం.స్.విశ్వనాథన్ సంగీతం అందించారు.ఈ చిత్రం 1953 లో తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదలయింది.ఈ సినిమాలో ఎన్.టీ.రామారావు గారు( Sr NTR ) హీరోగా నటించారు.భానుమతి గారు ద్విపాత్రాభినయం చేసారు.ఎస్.వీ.రంగారావు, రేలంగి ముఖ్య పాత్రలు పోషించారు.బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.అప్పట్లో ఈ చిత్రం ఒకే రోజు మూడు భాషలలో విడుదలైన మొదటి చిత్రంగా రికార్డు నెల్కొలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube