ఏపీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం( Speaker Tammineni Seetaram ) ఇచ్చిన గడువు ఇవాళ్టితో పూర్తయింది.ఈ క్రమంలో స్పీకర్ నోటీసులకు ముగ్గురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు( YCP Rebel MLAs ) రాతపూర్వక వివరణ ఇచ్చారు.
ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి,( Anam Ramnarayana Reddy ) శ్రీదేవి,( Sridevi ) మేకపాటి( Mekapati ) స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చారు.
మరోవైపు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( MLA Kotamreddy Sridhar Reddy ) తనకు ఎలాంటి నోటీసులు అందలేదని చెబుతున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు తనకు నోటీసు అందలేదనే అంశాన్ని కోటంరెడ్డి స్పీకర్ కార్యాలయానికి మెమో రూపంలో తెలియజేశారు.అలాగే ఈనెల 8వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇవ్వనున్నారు.