H1B Visa : హెచ్ 4 వీసాదారులకు బిగ్ రిలీఫ్ .. ‘‘ వర్క్ ఆథరైజేషన్ ’’బిల్లు ఆమోదానికి లైన్ క్లియర్

అమెరికాలో హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములు , వారి పిల్లలకు (హెచ్ 4 వీసా కలిగినవారికి) ఊరట కలిగింది.హెచ్ 4 వీసాదారులకు సంబంధించి సెనేట్‌లో రిపబ్లికన్‌లు, డెమొక్రాట్‌ల మధ్య జరిగిన డిబేట్‌లో ‘‘జాతీయ భద్రత ఒప్పందానికి ’’ ఆమోదం తెలిపేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి.

 Relief For Indian American Immigrants As Us Provides 100k Work Permits To Spous-TeluguStop.com

సాధారణంగా హెచ్‌1బీపై( H1B ) పనిచేస్తూ గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అది లభించడానికి సుమారు 15 ఏళ్లు పడుతుంది.ఈలోగా హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వామి అమెరికాలో ఉద్యోగంలో చేయడానికి అనుమతి ఉండేది కాదు.

వీరి ఆవేదనను అర్ధం చేసుకున్న నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా( Barack Obama ) 2015లో హెచ్ 4 ఈఏడీ (ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌) బిల్లు తెచ్చారు.దీని ప్రకారం హెచ్‌1బీపై పనిచేస్తూ గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్న వారి జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించారు.

ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్( Employment Authorization Document ) (ఈఏడీ), ఐ 765 కోసం హెచ్ 4 వీసాదారులు దరఖాస్తు చేసుకోవాలి.ఈ ప్రక్రియ ముగిసి ఆథరైజేషన్ వస్తేనే వారు ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.

కానీ ఈ సుదీర్ఘ ప్రక్రియ , నిరీక్షణ సమయం అంతా కలిపి ఏడాదిపైనే సమయం పడుతుంది.దీని వల్ల హెచ్ 4 వీసాదారులు ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదం నెలకొంది.

ఈ క్రమంలోనే ఆటోమేటిక్‌గా వర్క్ ఆథరైజేషన్ కల్పించేలా బిల్లు రూపొందించగా, దీనికి సెనేట్ త్వరలోనే ఆమోదం తెలపనుంది.దీని వల్ల దాదాపు లక్ష మందికి ప్రయోజనం కలగనుంది.

Telugu Green Cards, Visa Holders, Indian American, Permits-Telugu NRI

ఈ విధానం కింద ప్రతి సంవత్సరం 18 వేల మందికి ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డ్‌లను( Green cards ) జారీ చేస్తారు.ఐదేళ్లలో దాదాపు 1,58,000 మందికి లబ్ధికలుగుతుంది.దీంతో హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు ఇకపై తమ ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ పొడగింపు కోసం ఎదురుచూడకుండా ఆటోమెటిక్‌గా వర్క్ పర్మిట్స్ పొందనున్నారు.ఈ నిర్ణ‌యం వ‌ల్ల వేలాది మంది ఇండో-అమెరిక‌న్ మ‌హిళ‌ల‌కు ల‌బ్ధి చేకూర‌నున్న‌ది.

Telugu Green Cards, Visa Holders, Indian American, Permits-Telugu NRI

జీవిత భాగస్వామి హెచ్‌1బీ గడువుకు అనుగుణంగా హెచ్‌4 వీసా రెన్యూవల్‌ చేస్తారు.అయితే ఏడాదిన్నరగా కరోనా తదితర కారణాలతో యూఎస్‌సీఐఎస్‌ ఈఏడీ రెన్యూవల్‌( USCIS EAD Renewal ) చేయట్లేదు.దీంతో మార్చి 31 నాటికి సుమారు 91 వేల మంది భారతీయ మహిళలు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి వారి కుటుంబాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.దీనిపై భారతీయులు పలు కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేసి న్యాయపోరాటం సైతం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube