కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మరో ఆరు లేదా ఏడు నెలల కన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదని స్పష్టంగా చెప్పారు.
ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని జనాలు గ్రామగ్రామాన పాతరేస్తారని హెచ్చరించారు.టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని,కేసీఆర్ ఫ్యామిలీని ఇకపై ఎవరూ రక్షించలేరని వార్నింగ్ ఇచ్చారు.
బీజేపీపై కార్యకర్తలపై టీఆర్ఎస్ శ్రేణులు ఎన్నిదాడులు చేసినా జనాలు మాత్రం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించటం ఖాయమని జోస్యం చెప్పారు.
బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రలో టీఆర్ఎస్ శ్రేణులు కావాలనే రాళ్లదాడికి పాల్పడటంపై ఫైర్ అయ్యారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు చోద్యం చూస్తుండటం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు.పోలీసు అధికారులు పూర్తిగా టీఆర్ఎస్ కనుసన్నల్లోనే పనిచేస్తున్నట్లు కేంద్ర మంత్రి ఆరోపించారు.బండి సంజయ్ ప్రజాభరోసా యాత్రలో భాగంగా జనగాం చేరుకున్నారు.అక్కడ సభలో బండి సంజయ్ మాట్లాడుతుండగా టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు.
అనంతరం బీజేపీ శ్రేణులు కూడా టీఆర్ఎస్ శ్రేణులతో వాగ్వివాదానికి దిగారు.దీంతో ఇరునేతల మధ్య దాడులు జరిగాయి.
ముందుగా టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలపై రాళ్లదాడులకు పాల్పడతంతో ఐదుగురి తలలు పగిలాయి.అంతేకాకుండా పలువురికి గాయాలయ్యాయి.
కానీ పక్కనే ఉన్న పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు.

స్థానిక కమిషనర్ తరుణ్ జోషికి కాల్ చేసినా ఆయన సకాలంలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరిగాయని బీజేపీ స్టేట్ చీఫ్ ఫైర్ అయ్యారు.పోలీసుల సెక్యూరిటీని తిరిగి వెనక్కి పంపించివేశారు.టీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతంగా ఉండదని, మరో ఆరునెలల్లో కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుందని కూడా సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిని బట్టి కేసీఆర్ త్వరలోనే ముందస్తుకు వెళతారని తెలుస్తోంది.కాగా, స్థానిక మంత్రి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ నేతలు బీజేపీ ఫ్లెక్సీలు చించివేయడమే కాకుండా,కార్యకర్తలపై దాడులకు పాల్పడినట్టు కమలం పార్టీ ఆరోపించింది.