తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “ఫిదా” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తన నటన, అందం, అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఫిదా చేసినటువంటి మలయాళ బ్యూటీ “సాయి పల్లవి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ఎక్స్ పోజింగ్ పాత్రలకి దూరంగా ఉంటోంది.
అంతేగాక తాను ఎక్స్ పోజింగ్ చేయలేనని, ఒకవేళ అలాంటి అవకాశాలు వస్తే వాటికి నిర్మొహమాటంగా నో చెప్పేస్తానని ఆ మధ్య ఓ ప్రముఖ పత్రిక నిర్వహించిన ఇంటర్వ్యూలో తెలిపింది.
అయితే తాజాగా ప్రముఖ ప్రవచనకర్త “గరికపాటి నరసింహారావు” సాయి పల్లవి గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇందులో భాగంగా సాయి పల్లవి ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటానని చెప్పడంతో తనకు ఎంతో సంతోషంగా ఉందని అంతేగాక కురుస దుస్తులను కూడా ధరించకుండా కేవలం నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకతని పరోక్షంగా చెప్పుకొచ్చాడు.అలాగే ఆమె కలకాలం సంతోషంగా ఉండాలంటూ దీవెనలు కూడా అందించాడు.
సాయి పల్లవి లాంటి నటి నటులు ఉంటే సినిమా పరిశ్రమ కచ్చితంగా బాగుపడుతుందని అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చాడు.అంతేగాక ఎన్ని తరాలు గడిచినా సాయి పల్లవి లాంటి నటీనటుల సినిమాలకు క్రేజ్ తగ్గదని కేవలం ఎక్స్ పోజింగ్ చేయడం వల్ల, దుస్తులు ధరించడం వల్ల సినిమాలు హిట్ కావని కూడా తన అభిప్రాయాన్ని తెలిపాడు.
దీంతో గరికపాటి నరసింహారావు గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో టాలీవుడ్ ప్రముఖ హీరో రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్నటువంటి “విరాట పర్వం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ప్రముఖ సీనియర్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “లవ్ స్టోరీ” అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది.