విదేశీ విద్య అంటే అత్యధిక శాతం మంది వలస విద్యార్ధులు ప్రపంచ నలుమూలల నుంచీ అమెరికా వెళ్లేందుకు మొదటి ప్రాధ్యానతను ఇస్తుంటారు.అలా వెళ్ళే అమెరికా వెళ్ళే వారిలో అత్యధిక శాతం మంది భారతీయ విద్యార్ధులు కావడం గమనార్హం.
అమెరికా సైతం విదేశీ విద్యార్ధులలో భారతీయ విద్యార్ధులకే ప్రాధాన్యతను ఇస్తుంటుంది.అయితే అమెరికా విధించిన వీసా నిభందనలు, కరోనా ప్రభావం వెరసి భారతీయ విద్యార్ధి వీసాలపై ప్రభావం చూపడంతో భారతీయ విద్యార్ధులు క్రమంగా ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి పెట్టారు.
ఈ క్రమంలోనే.
బ్రిటన్ భారతీయ విద్యార్ధులను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నంలో తమ విద్యార్ధి వీసాలలో కీలక మార్పులు తీసుకువచ్చింది.
దాంతో బ్రిటన్ లో చదువుకునేందుకు భారీ సంఖ్యలో భారత విద్యార్ధులు క్యూ కడుతున్నారు.అందుకు కారణం కేవలం విద్యార్ధులను ఆకర్షించేందుకు ప్రారంభించన గ్రాడ్యుయేషన్ వీసానే.ఈ వీసా ప్రకారం విదేశీ విద్యార్ధులు ఎవరైనా సరే బ్రిటన్ లో చదువుకున్న తరువాత రెండేళ్ళ పాటు బ్రిటన్ లోనే ఉద్యోగం చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.అంతేకాదు ఇతర వీసాల మాదిరిగా ముందుగానే ఉద్యోగం ఆఫర్ చూపించే నిభందన లేకపోవడంతో పాటు వీసా సంఖ్యలో ఎలాంటి పరిమితులు లేకపోవడంతో భారత విద్యార్ధులు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారట.
భారత్ లోని బ్రిటన్ హై కమిషన్ లెక్కల ప్రకారం మార్చి 2022 నాటికి బ్రిటన్ 108000 వేల మంది భారతీయ విద్యార్ధులకు వీసాలు జారీ అయ్యాయని తెలిపింది.గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఇచ్చిన వీసాలు రెండు రెట్లు అధికమట.బ్రిటన్ భారత్ ల మధ్య తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయపరమైన దౌత్య కారణాలు కూడా భారతీయ విద్యార్ధులు అధికశాతం లో బ్రిటనే వెళ్లేందుకు కారణమవుతున్నాయని అంటున్నారు నిపుణులు.ఈ వీసా కారణంగా సుమారు 12 వేల మంది భారతీయ విధ్యార్దులు ఇప్పటి వరకూ లబ్ది పొందారట.