కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Hero Thalapathy Vijay ) సినిమాలకు గట్టి డిమాండ్ ఉంది.ఈయనకు మన ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఉంది.
తమిళ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో ఫాలోయింగ్ అందుకుని దూసుకు పోతున్న విజయ్ చేస్తున్న సినిమాలన్నీ కోట్లకు కోట్లు రాబడుతూ నిర్మాత జేబులను నింపుతున్నాయి.

అంతేకాదు విజయ్ ఏ సినిమా చేసిన అది భారీ బిజినెస్ జరుపు కుంటుంది.అంతేకాదు రిలీజ్ కు ముందు నుండే ఎన్నో అంచనాలను క్రియేట్ చేసుకుంటుంది.రిలీజ్ కు ముందే ఈయన సినిమాలు వందల కోట్ల బిజినెస్ చేస్తుంటాయి.
ఈ బిజినెస్ కు తగ్గట్టుగానే విజయ్ తలపతి లేటెస్ట్ గా చేస్తున్న సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
విజయ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో ‘లియో’ సినిమా చేస్తున్నాడు.
పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా విజయ్ సినిమాపై ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ మాములుగా లేదు.తాజాగా లియో సినిమా( Leo Movie ) యూఎస్ లో రికార్డ్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది.
ఇటీవలే ట్రైలర్ రిలీజ్ తో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా జరుగుతున్నట్టు తెలుస్తుంది.

ఇప్పుడు ఆల్రెడీ 9 లక్షల డాలర్స్ ను యూఎస్ మార్కెట్( Leo Movie US Collections ) దగ్గర గ్రాస్ అయ్యిందట.మరి రిలీజ్ సమయానికి ఇది 1 మిలియన్ మార్క్ ను కూడా క్రాస్ చేస్తుంది.దీంతో జస్ట్ ప్రీమియర్స్ తోనే సెన్సేషనల్ మైల్ స్టోన్ చేరుకోనుందని తెలుస్తుంది.ఇదిలా ఉండగా సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు.చూడాలి ఓపెనింగ్స్ తోనే ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో.