ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.నాయకన్ గూడెంలో పోలింగ్ బూత్ దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఇరు పార్టీ శ్రేణుల మధ్య చెలరేగిన వివాదం కాస్త ముదరడంతో పరస్పర దాడులకు పాల్పడ్డారని తెలుస్తోంది.ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ నేతలకు స్వల్ప గాయాలు అయ్యాయి.
దీంతో పోలింగ్ కేంద్రం వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.అయితే ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.