కడప జిల్లా గుండాపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.భూ వివాదంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఈ క్రమంలో రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు పరస్పరం కర్రలతో దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది.
రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.అనంతరం ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.