ఆ ముగ్గురిలో టెన్షన్.. టెన్షన్ !

బీజేపీలో తాజాగా జరుగుతున్నా పరిణామాలు ఆ పార్టీ నేతలను తీవ్రంగా టెన్షన్ పెడుతున్నాయి.ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నప్పటికి.

 Tension Among Those Three... Tension,eetala,bandi Sanjay,lakshman,bjp Telongana-TeluguStop.com

ఓ విషయంలో మాత్రం పార్టీలోని కీలక నేతలు గందరగోళానికి గురౌతున్నట్లు తెలుస్తోంది.అదేమిటంటే సి‌ఎం అభ్యర్థి ఎవరనే అంశం.

బీసీలలోనుంచి సి‌ఎం అభ్యర్థిని ఎంపిక చేస్తామని చెప్పడంతో ఇతర నేతలు సి‌ఎం పదవిపై ఆశలు వదిలేసుకున్నారు.అయితే ఇప్పుడు బీసీలలో నుంచి ఎవరిని సి‌ఎం అభ్యర్థి చేస్తారనేది ఆసక్తికరమైన ప్రశ్న.

ప్రస్తుతం ముగ్గురి పేర్లు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.వారెవరనగా బండి సంజయ్, ఈటెల రాజేందర్, లక్ష్మణ్.

ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని సి‌ఎం అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని టాక్.

మొదటి నుంచి కూడా సి‌ఎం అభ్యర్థి రేస్ లో బండి సంజయ్ ముందు వరుసలో ఉన్నారు.

దానికి తోడు బీసీ నేత కావడంతో బండికే ఎక్కువ ఛాన్స్ లు ఉన్నాయనేది చాలమంది భావన.అయితే ఈ మద్య ఈటెల రాజేందర్ విషయంలో కూడా అధిష్టానం ఎంతో చొరవగా ఉంటోంది.

మొదట చేరికల కమిటీ చైర్మెన్ బాధ్యతలు అప్పగించిన పార్టీ హైకమాండ్ కొద్ది రోజుల్లోనే ఈటెలకు ప్రచార కమిటీ చైర్మెన్ బాద్యతలను కూడా అప్పటించింది.ఆ రకంగా ఇతర నేతలను పక్కన పెట్టి ఈటెలకు అధిక ప్రదాన్యం ఇస్తూ వస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం.

దీంతో బండి సంజయ్ ని కాదని సి‌ఎం అభ్యర్థిగా ఈటెల రాజేందర్ ను ప్రకటించిన ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం.అయితే ఈటెల రాజేందర్ మరియు బండి సంజయ్ మద్య గత కొన్నాళ్లుగా కోల్డ్ వార్ నడుస్తున్నాట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Telugu Bandi Sanjay, Bjp Telongana, Eetala, Etela Rajendar, Lakshman-Politics

ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఎవరిని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటించిన మరొకరి నుంచి పార్టీలో విభేదాలు పెరగడం ఖాయం.అందుకే ఈ ఇద్దరిని కాదని  సీనియర్ నేత లక్ష్మణ్ ను సి‌ఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.బీసీ నేత కావడం దానికి తోడు పార్టీలో అందరితోను సత్సంబంధాలు కలిగి ఉండడంతో లక్ష్మణ్ కు ఆ ఛాన్స్ ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని కమలం పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట.

దీంతో ఎవరిని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటిస్తారనే దానిపై ఈ ముగ్గురిలో టెన్షన్ పెరుగుతున్నాట్లు తెలుస్తోంది.మరి ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని సి‌ఎం అభ్యర్థి గా ప్రకటిస్తారా లేదా ఊహించని రీతిలో కొత్తవారిని తెరపైకి తీసుకొస్తారా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube