సుమా రాజీవ్ కనకాల… చాలామంది వీరికి విడాకులు జరిగాయని, వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, వీరి కుటుంబంలో పొరపచ్చాలు ఉన్నాయని రకరకాలుగా సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలుతుంటారు.ఇంకో అడుగు ముందుకేసి వీరు అసలు కలిసి ఉండటం లేదంటూ కూడా ఎవరికి నచ్చింది వారు మాట్లాడుతూ ఉంటారు.
దీనికి తగ్గట్టుగానే యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో అనేక పోస్టులు కూడా దర్శనమిస్తున్నాయి.అసలు నిజంగా తెలియకుండానే జనాలకు ఒక రకమైన వార్తలను ప్రసారం చేస్తూ మీడియా కూడా వ్యక్తిగత జీవితాల్లో దూరుతుండడం బాధాకరమైన చెప్పాలి.

నిజా నిజాలు ఎవరికీ అవసరం లేదు.అందుకే కనబడే వార్త అనుకోని నమ్మే కాలంలో ఉన్నాము.కానీ అసలు వాస్తవం ఏమిటి అంటే సుమ రాజీవ్ ఇద్దరు కూడా అనుబంధాలకు విలువ నిచ్చే మనుషులు.చిన్ననాటి నుంచి అలాంటి విలువల మధ్య పెరిగారు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న కూడా అత్తమామలను తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించింది సుమ.అలాగే తన అత్తమామలను తన పక్క పోర్షన్ లోనే పెట్టుకొని మరి ఎంతో దగ్గరగా చూసుకున్నాడు రాజీవ్.అలా ఒకరి పక్కనే ఒకరు ఉంటూ ఎప్పుడూ కూడా దూరం కాకుండా జాగ్రత్తగా కడవరకు కూడా కలిసి ఉన్నారు రాజీవ్ మరియు సుమ కుటుంబాలు.
ఇప్పటికీ కూడా సుమ కుటుంబ సభ్యులు అంతా కూడా రాజీవ్ దగ్గరే ఉంటారు.అందుకే వారి మధ్య గొడవలు ఉన్నాయా అనడంలో ఎలాంటి వాస్తవం లేదు.ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగే విషయాలు వాళ్ళింట్లో కూడా జరుగుతాయి.కానీ దానికి చిలువలు పలువలుగా వార్తలు వల్లేసి రాయడం సర్వసాధారణంగా మారిపోయింది.

ఇక తన ఆడపడుచు చనిపోతే సుమ ఎంతగానో తల్లడిల్లింది.అత్తమామలను, ఆడపడుచును అది తక్కువ సమయంలో కోల్పోవడంతో సుమ కాస్త బలహీన పడింది.అయినా కూడా రాజీవ్ కి ఎంతో అండగా ఉంది.తన ఆడపడుచు పిల్లల్ని కూడా తానే అని దగ్గరుండి చూసుకుంటుంది ప్రస్తుతం తనకు ఇద్దరు పిల్లలు కాదు నలుగురు పిల్లలు అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది.
రాజీవ్ కూడా సుమ మంచితనాన్ని ఎప్పుడూ అర్థం చేసుకుంటాడు.అందుకే మీడియాలో వచ్చే వార్తలను ఏమాత్రం లెక్క చేయడు.తన భార్య గొప్పది కానీ నేనైతే అసమర్థుడిని కాదు అంటూ పలు ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నాడు రాజీవ్.ఇకపోతే తన చెల్లి పిల్లల్ని కూడా తానే తెచ్చుకోవాలని భావించినప్పటికీ వారికి వాళ్ల తండ్రితో ఉన్న అటాచ్మెంట్ కారణంగా ఆ ఇంటి నుంచి బయటకు రావడంలేదని లేకపోతే నా చెల్లె పిల్లలు నా పిల్లలు నాతో పాటే ఉండేవారు అంటూ రాజీవ్ ఇటీవల ఓ మీడియాతో పంచుకున్నారు
.