సినిమా, రాజకీయ రంగాల్లో గుర్తింపును సొంతం చేసుకున్న సెలబ్రిటీలు తమ జీవితాలలో ప్రతిదీ ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.ముఖ్యంగా పిల్లల పేర్లకు సంబంధించి సెలబ్రిటీలు తీసుకునే జాగ్రత్తలు అన్నీఇన్నీ కావు.
అయితే హీరోయిన్లలో ఎక్కువమంది హీరోయిన్లు తమ పిల్లలకు దేవుళ్ల పేర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.అలియా భట్ తన కూతురికి రాహా అనే పేరును పెట్టిన సంగతి తెలిసిందే.
రాహా అనే పేరుకు వేర్వేరు భాషలలో వేర్వేరు అర్థాలు ఉండగా ఈ పేరుకు స్వాహిలి భాషలో దైవిక మార్గం అనే అర్థం వస్తుంది.ఐశ్వర్యారాయ్ కూతురు పేరు ఆరాధ్య కాగా ఆరాధ్య అంటే దేవుడిని ఆరాధించడం అనే అర్థం కూడా వస్తుంది.
శిల్పాశెట్టి కుమారుడి పేరు వియాన్ కాగా ఈ పేరుకు శ్రీ కృష్ణ అనే అర్థం కూడా ఉంది.ప్రియాంక చోప్రా కూతురి పేరు మాల్తీ మేరా చోప్రా జోనస్ కాగా ఈ పేరుకు పువ్వుల సువాసన అనే అర్థం ఉంది.

సొనమ్ కొడుకు పేరు వాయు కాగా ఈ పేరుకు ఆంజనేయుడు అనే అర్థం కూడా వస్తుంది.అనుష్క శర్మ కూతురు పేరు వామిక కాగా దుర్గా మాతకు మరో పేరు వామిక కావడం గమనర్హం.బిపాస బసు తన కూతురుకు దేవి అని నామకరణం చేశారు.దేవుళ్ల పేర్లు పెట్టుకోవడం ద్వారా మంచి జరుగుతుందని భావించి చాలామంది ఫ్యాన్స్ భావిస్తున్నారు.టాలీవుడ్ సెలబ్రిటీలలో కూడా కొంతమంది సెలబ్రిటీలు తమ పిల్లలకు దేవుళ్ల పేర్లను పెట్టుకున్నారు.